వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడి విమానం ఎగిరే శ్వేతసౌధం, ఇవీ ప్రత్యేకతలు...

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా ఆదివారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. అగ్రరాజ్య అధినేత ప్రయాణించే విమానం అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్. దీనిని ఎగరే అధ్యక్ష భవనంగా పిలుస్తారు. ఈ విమానం నుండి అణ్వస్త్ర దాడులకు ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఈ విమానం ఖరీదు రూ.15 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ విమానం నిర్వహణ, ప్రయాణానికి గంటకు అయ్యే ఖర్చు ఆరు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. విమానం గరిష్టంగా వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఏకబిగిన ఎక్కడా ఆగకుండా పన్నెండు వేల అయిదువందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు.

ఎయిర్ ఫోర్స్ వన్‌లో 102 మంది ప్రయాణించవచ్చు. అగ్రరాజ్యాధినేత విమానానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. విమానం విండ్ షీల్డ్‌ను బాంబులు బద్దలు చేయలేదు. కిటికీలన్నింటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉంటాయి. రాకెట్లు కూడా వీటిని ఏం చేయలేవు. అణుబాంబు పేలినా విమానానికి ఏమీ కాదు.

ఎక్కడి నుండి ఎలాంటి దాడులు జరిపినా ఇది తట్టుకుంటుంది. ఈ విమానం ఇతర దేశాల రాడార్లకు అస్సలు చిక్కదు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం... ముందు ఏమీ కనిపించనంత దట్టంగా మంచు ఉన్నప్పటికీ ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉంది. ఎలాంటి క్షిపణిలను అయినా దారి మళ్లించగలదు.

విమానంలో అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంది. ప్రయాణిస్తూనే ప్రపంచంలోని ఏ దేశాధినేతతోనైనా మాట్లాడే వ్యవస్థ ఉంది. ఇందులో 85 టెలిఫోన్లు, 19 ఎల్సీడీ స్క్రీన్లు ఉన్నాయి. గగనతలంలో ప్రయాణిస్తూనే మరో విమానం నుండి ఫ్యూయల్ నింపుకోవచ్చు.

ఎయిర్ ఫోర్స్ వన్

ఎయిర్ ఫోర్స్ వన్

అగ్రరాజ్య అధినేత ప్రయాణించే విమానం అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్. దీనిని ఎగరే అధ్యక్ష భవనంగా పిలుస్తారు.

ఒబామా, మిచెల్లీ

ఒబామా, మిచెల్లీ

భారత్ బయలుదేరే ముందు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామాలు ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వస్తున్న దృశ్యం.

భారత్

భారత్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా ఆదివారం ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు.

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా ఆదివారం ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు.

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

అగ్రరాజ్య అధినేత ప్రయాణించే విమానం అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్. దీనిని ఎగరే అధ్యక్ష భవనంగా పిలుస్తారు. ఈ విమానం నుండి అణ్వస్తర దాడులకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ విమానం ఖరీదు రూ.15 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

English summary
Barack Obama arrives india by Air Force One
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X