వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నివాసికి ఒబామా కాల్ ... జో బైడెన్ కు ఓటెయ్యాలని.. ఒబామా ముచ్చట ఎలా సాగిందంటే !!

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. డెమోక్రాట్లు నుండి అమెరికా అధ్యక్షుడిగా బరిలోకి దిగిన అభ్యర్థి జో బైడెన్ కోసం రంగంలోకి దిగిన బరాక్ ఒబామా అమెరికా ఓటర్లకు డోనాల్డ్ ట్రంప్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అమెరికా నివాసి అలిస్సా కు ఫోన్ చేసి ఆమెను ఆశ్చర్యానికి గురి చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.

US elections 2020: చెత్తబుట్టలో ట్రంప్... ఓ మ్యూజియం నిర్వాకం .. ప్రజా తీర్పు ఇలాగే ఉంటుందా ? US elections 2020: చెత్తబుట్టలో ట్రంప్... ఓ మ్యూజియం నిర్వాకం .. ప్రజా తీర్పు ఇలాగే ఉంటుందా ?

అమెరికా నివాసి అలిస్సాకు వీడియో కాల్ చేసిన బరాక్ ఒబామా

అమెరికా నివాసి అలిస్సాకు వీడియో కాల్ చేసిన బరాక్ ఒబామా

అమెరికా నివాసి అలిస్సాకు వీడియో కాల్ చేసిన బరాక్ ఒబామా ఆమెను ఆప్యాయంగా పలకరించారు. తాను ఒబామా అని చెప్పడంతో ఆశ్చర్యానికి గురైన సదరు మహిళ చాలా సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కు ఓటు వేయాల్సిందిగా బరాక్ ఒబామా అలిస్సాను కోరారు. ఆమెతో మాట్లాడుతుండగా, అలిస్సా 8 నెలల కొడుకు ఏడవటం మొదలు పెట్టాడు. దీంతో ఏడుస్తున్న చిన్నారిని గురించి అడిగిన ఒబామా బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశించారు .

అలిస్సా 8 నెలల కొడుకుతో ముచ్చటించిన మాజీ అధ్యక్షుడు ఒబామా

అలిస్సా 8 నెలల కొడుకుతో ముచ్చటించిన మాజీ అధ్యక్షుడు ఒబామా

అలిస్సా తనకు ఏ ఫోన్ కాల్ వచ్చినా ఇలాగే ఏడుస్తాడని , తాను కూడా మాట్లాడతానని అలా ఏడుస్తాడని చెప్పారు. దీంతో ఒబామా ఆ బుడతడిని ఎలా ఉన్నావ్ అంటూ పలకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో షేర్ చేయడం తో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
కరోనా వ్యాప్తి నేపద్యంలో బయటకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడంతో ఒబామా ఫోన్లోనే డెమోక్రాట్ల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. బైడెన్ కు ఓటు వేయాలని కోరుతున్నారు .

Recommended Video

US Election 2020 : Electoral College Is Key Factor,All you Need to Know| #USpresidentialpolls
 బైడెన్ కు, కమలా హ్యారిస్ కు ఓటెయ్యాలని కోరిన ఒబామా ..ఓటరు నుండి మంచి రెస్పాన్స్

బైడెన్ కు, కమలా హ్యారిస్ కు ఓటెయ్యాలని కోరిన ఒబామా ..ఓటరు నుండి మంచి రెస్పాన్స్

ఫోన్ ద్వారా ప్రచారం చేయడాన్ని ఫోన్ బ్యాంకింగ్ అంటారు. దీనిలో భాగంగా ఓటరు తో మాట్లాడిన ఒబామాతో ఓటర్ కూడా సంతోషంగా మాట్లాడారు. బైడెన్ కు , కమలా హ్యారిస్ కు ఓటు వేయడానికి తానెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆమె ఒబామాతో చెప్పారు. ఇక తను మాత్రమే కాదు బైడెన్ కు ఓటు వేయడం కోసం ఆమె కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు చెప్పాలని బరాక్ ఒబామా ఆమెను కోరారు. మొత్తానికి అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో, బరాక్ ఒబామా ఓటర్లతో నేరుగా మాట్లాడుతున్న తీరు డెమోక్రాట్లకు ప్లస్ గా మారనుంది .

English summary
Barack obama was urging everyone to vote for Joe Biden through what he called "phone banking" and Ms Alyssa was one of them. He shared the much-loved video of the interaction on his Twitter account.Surprised at the call, she joked about having a panic attack before saying she would love to vote for Joe Biden and his running mate Kamala Harris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X