• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ పనిచేస్తే.. మిషెల్‌తో విడాకులే : టీవీ షోలో ఒబామా

|

లాస్ ఏంజిల్స్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా.. విమర్శలు, వ్యంగ్య వాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు హిల్లరీకి మధ్య జరుగుతూ వస్తోన్న మూటల యుద్దంలోకి.. ఒబామా కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒబామాను టార్గెట్ చేస్తూ.. ట్రంప్ పలు విమర్శలు గుప్పించడంతో.. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ చురకలంటించే ప్రయత్నం చేశారు ఒబామా.

'జిమ్మీ కిమ్మెల్‌ లైవ్‌' షోలో పాల్గొన్న సందర్బంగా.. వ్యాఖ్యాత ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు ఒబామా. అమెరికా అధ్యక్ష పదవికి రెండు సార్లు మాత్రమే అవకాశమున్నప్పటికీ.. మూడోసారి కూడా అవకాశం కల్పిస్తే.. మళ్లీ అధ్యక్ష పోటీలోకి దిగేవారా? అంటూ కిమ్మెల్ ప్రశ్నించగా.. మరోసారి రాజకీయాల్లోకి దిగితే ఇక తన భార్య (మిషెల్లీ) విడాకులు ఇచ్చేయడం ఖాయం అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు ఒబామా.

Barack Obama does another round of mean tweets on Jimmy Kimmel Live and trolls Donald Trump

ఇక ఇదే షోలో ట్రంప్ పై కూడా పలు సెటైర్లు వేశారు ఒబామా. 'అమెరికా చరిత్రలోనే ఒబామా అత్యంత చెత్త అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోతారు' అన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'కనీసం నేను అధ్యక్షుడిగా దిగిపోతా'నని పంచ్ ఇచ్చారు. ఇక నవంబర్ 8న జరగబోయే ఎన్నికల్లో రిగ్గింగ్ జరగబోతుంది అంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను.. మరో విషయంతో ముడిపెట్టి సున్నితంగా తిప్పొకొట్టారు ఒబామా.

'ఒబామా కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రమోషన్స్‌ కోసం.. కమెడియన్‌ బిల్‌ ముర్రేతో కలిసి ఇటీవలే వైట్‌హౌస్‌లో గేమ్‌ ఆడానని.. ఈ గేమ్‌లో గోల్ఫ్‌ బాల్స్‌ను గ్లాస్‌లో పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో బిల్‌ ముర్రే పలుమార్లు గెలిచారని.. అయితే గ్లాస్‌ రిగ్గింగ్‌ కు పాల్పడి ఉండవచ్చునని..' పరోక్షంగా ట్రంప్ కు కౌంటర్ ఇచ్చారు ఒబామా.

ఇక ట్రంప్ ను టీవిలో చూసి ఎప్పుడైనా నవ్వారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. చాలాసార్లు నవ్వాను చెప్పారు ఒబామా. మూడు, నాలుగు సందర్బాల్లో రాత్రిపూట నిద్రలో ఉన్న సమయంలోను తాను ఫోన్ కాల్స్ తీసుకుంటానని, కానీ ట్రంప్ స్మార్ట్ ఫోన్ మాత్రం పగటిపూట కూడా కనెక్ట్ అవదని ఎద్దేవా చేశారు. ఇక మొన్నీమధ్యే తెల్లవారు జామున 3గం.లకు తనపై వస్తోన్న లైంగిక ఆరోపణల పట్ల ట్విట్టర్ ద్వారా ట్రంప్ స్పందించిన విషయాన్ని ఎద్దేవా చేస్తూ.. తనను అవమానించిన వారి గురించైనా సరే తెల్లవారుజామున 3 గంటలకు తాను ట్వీట్‌ చేయను అని ట్రంప్ పై పంచ్ పేల్చారు ఒబామా.

English summary
Obama may be coming to the end of his second term as president, but that has not stopped him squeezing in one last appearance on Jimmy Kimmel’s late night TV show to do another round of the comedian’s ‘Mean Tweets’ feature – and get in a few digs at Donald Trump at the same time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more