వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెలరేగిన హ్యాకర్లు: హైప్రొఫైల్ అకౌంట్లలో భారీ స్కామ్: బిట్ కాయిన్: ఒబామా, బిల్‌గేట్స్ :

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హ్యాకర్లు చెలరేగిపోయారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా విధ్వంసాన్ని సృష్టించారు. అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లలో చొరబడ్డారు. వాటన్నింటినీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఓ పద్ధతి ప్రకారం.. ఎవరికీ అనుమానాలు రానివిధంగా ట్విట్లను చేశారు. క్రిప్టోకరెన్సీ కుంభకోణానికి తెర తీశారు. బిట్ కాయిన్ స్కామ్‌కు బీజం వేశారు. హ్యాకర్లు చేసిన ఈ ట్విట్టర్ విధ్వంసాన్ని ఉగ్రవాదుల దాడులతో పోల్చవచ్చు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్లలో హ్యాకర్లు చొరబడటం పట్ల ట్విట్టర్ యాజమాన్యం షాక్‌కు గురైంది. వాళ్లు చేసిన ట్వీట్లను డిలేట్ చేసే పనిలో పడింది.

Recommended Video

Elon Musk, Obama, Bill Gates, Joe Biden High Profile Twitter Accounts హ్యాక్‌ to Run Bitcoin స్కామ్‌

కరోనాకు విరుగుడు ఆ జంతువు: వైరస్‌ను మట్టుబెట్టే యాంటీబాడీస్ ఫుల్‌గా: సహజంగా వృద్ధి చెందేలాకరోనాకు విరుగుడు ఆ జంతువు: వైరస్‌ను మట్టుబెట్టే యాంటీబాడీస్ ఫుల్‌గా: సహజంగా వృద్ధి చెందేలా

హై ప్రొఫైల్ అకౌంట్లలో చొరబడి..

హై ప్రొఫైల్ అకౌంట్లలో చొరబడి..

ఎలాంటి అనుమానాలు కలగకుండా బిట్ కాయిన్‌ను సమర్థిస్తూ హ్యాకర్లు ట్వీట్లు చేశారు. ఫలానా ఖాతాకు క్రిప్టోకరెన్సీని పంపించాలంటూ కోరారు. హ్యాకర్లు తరచూ వెబ్‌సైట్లు, ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్‌బుక్‌ ఖాతాల్లోకి చొరబడుతూ తమకు అనుకూలంగా వాటిని మార్చుకోవడం సాధారణమే అయినప్పటికీ.. ఈ సారి మాత్రం అగ్రరాజ్యం అమెరికాకు చెందిన హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లను టార్గెట్‌గా చేసుకోవడం ఇదే తొలిసారి.

బరాక్ ఒబామా సహా..

బరాక్ ఒబామా సహా..

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెక్ దిగ్గజం యాపిల్, అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా భావిస్తోన్న జో బిడెన్, అంతరిక్షానికి ప్రవేటు రాకెట్లను పంపించే శక్తి, సామర్థ్యాలు గల బిలియనీర్ ఎలాన్ మస్క్, అపర కుబేరుడు జెఫ్ బెజోస్, కిమ్ కర్దాషియన్ వంటి పెద్ద తలకాయల ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. హ్యాక్‌కు గురైన హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లలో ఎవరి ప్రొఫైల్ పిక్.. వారివే ఉన్నాయి. ప్రొఫైల్ పిక్‌లో గానీ, బయోడేటాలో గానీ ఎలాంటి మార్పులు చేయలేదు హ్యాకర్లు. తమకు అనుకూలంగా ట్వీట్లను చేశారు.

వెయ్యికి రెండువేలు..

వెయ్యికి రెండువేలు..

ఒబామా సహా.. తమ ఆధీనంలోకి తెచ్చుకున్న అకౌంట్లల్లో హ్యాకర్లు చేసిన ట్వీట్లన్నీ బిట్ కాయిన్‌తో లింక్ ఉన్నవే. బిట్ కాయిన్ రూపంలో తమ ఖాతాలకు వెయ్యి డాలర్లను పంపించాలని, ఆ అమౌంట్.. వెంటనే డబుల్ అవుతుందని హ్యాకర్లు పేర్కొన్నారు. డబుల్ అమౌంట్ చెల్లిస్తామని సూచించారు. వెయ్యి డాలర్లను పంపించితే.. కొన్ని నిమిషాల వ్యవధిలో రెండువేల డాలర్లను చెల్లిస్తామని తెలిపారు. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి అపర కుబేరులు వెయ్యికి రెండువేలను ఇస్తామంటే వెనుకాముందు ఆలోచించరు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్లో

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్లో

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చోటు చేసుకున్న అతిపెద్ద హ్యాకింగ్ దీన్ని అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. బ్లూ టిక్ ఉన్న హైప్రొఫైల్ అకౌంట్లను కూడా హ్యాక్ చేయవచ్చనే విషయాన్ని హ్యాకర్లు నిరూపించారని చెబుతున్నారు. బిట్ కాయిన్ కుంభకోణమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై ట్విట్టర్ యాజమాన్యం వెంటనే స్పందించింది. నష్టాన్ని నివారించే పనిలో పడింది. హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగిస్తోంది. తమ అకౌంట్ల పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని సూచిస్తోంది.

ట్విట్టర్ ఖాతాల్లో

ట్విట్టర్ ఖాతాల్లో

ఈ ఘటన తరువాత కొన్ని అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్ యాజమాన్యం. సెక్యూరిటీ బ్రీచ్‌గా దీన్ని పరిగణించలేమని వెల్లడించింది. ఈ హ్యాకింగ్ ఉదంతం ఎక్కడి నుంచి ఆరంభమైందనే విషయంపై ఆరా తీస్తున్నామని పేర్కొంది. సెక్యూరిటీ విభాగానికి చెందిన సిబ్బంది దీనిపై పని చేస్తున్నారని స్పష్టం చేసింది. కొన్ని ట్విట్టర్ అకౌంట్లను తాము ఉద్దేశపూరకంగా స్తంభింపజేశామని, సెక్యూరిటీ పరమైన చర్యల అనంతరం వాటిని పునరుద్ధరిస్తామని పేర్కొంది.

English summary
The official accounts of Barack Obama, Joe Biden and Kanye West also requested donations in the cryptocurrency. Billionaires Elon Musk, Jeff Bezos and Bill Gates are among many prominent US figures targeted by hackers on Twitter in an apparent Bitcoin scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X