• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒబామా ఉద్వేగం, కంటతడి: చిన్న కూతురు ఎక్కడ?

|

వాషింగ్టన్: బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య మిచెల్లీ, కూతుళ్ల పేర్లను ప్రస్తావించారు. ఆ సమయంలో ఫ్యామిలీలో సషా తప్ప మిగిలిన వారు ఉన్నారు.

ఉద్వేగం, కంటతడి, వెల్లువెత్తిన అభిమానంతో.. ఒబామా చివరి ప్రసంగం అందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఆయన అభిమానులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఒబామా చిన్న కూతురు సషా మాత్రం హాజరు కాలేదు.

<strong>అగ్ర దేశమే, ట్రంప్ మారతారు?: చివరి ప్రసంగంలో ఒబామా ఉద్వేగం</strong>అగ్ర దేశమే, ట్రంప్ మారతారు?: చివరి ప్రసంగంలో ఒబామా ఉద్వేగం

ఒబామా తన చివరి ప్రసంగంలో కుటుంబం గురించి ప్రస్తావించారు. తన భార్యకు థ్యాంక్స్ చెప్పారు. తన కుమార్తెలకు తండ్రిని కావడాన్ని గర్విస్తున్నానన్నారు. తన కుమార్తెలు తెలివైనవారని, అందమైనవారని, ముఖ్యంగా దయ ఉన్నవారని, ఆలోచనాపరులని, పట్టుదల ఉన్నవారని ఒబామా చెప్పారు.

దీంతో మీడియా దృష్టి ఆయన కుమార్తెలపై పడింది. అక్కడ ఆయన చిన్న కుమార్తె సాషా కనిపించలేదు. ఆమెకు అంత ముఖ్యమైన పని ఏముందా అని అందరూ తలలు బద్దలు కొట్టుకున్నారు.

<strong>చట్టబద్ధమా?: అల్లుడికి పదవి కట్టబెట్టిన ట్రంప్, కూతురు 'షిఫ్ట్' ఆలోచన</strong>చట్టబద్ధమా?: అల్లుడికి పదవి కట్టబెట్టిన ట్రంప్, కూతురు 'షిఫ్ట్' ఆలోచన

అయితే, ఆ సమయంలో ఒబామా కుమార్తె సాషా పాఠశాలలో పరీక్షలకు హాజరయ్యారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఒబామా కుటుంబం మొత్తం చికాగోకు పయనమైతే సాషా మాత్రం వాషింగ్టన్‌ డిసి లోనే ఉండిపోయారు. పదవీ విరమణ తర్వాత కూడా సాషా చదువుల నిమిత్తం కొన్నాళ్లు వాషింగ్టన్‌లోనే ఉంటామని ఒబామా మార్చిలో ప్రకటించారు. మధ్యలో స్కూల్‌ మార్చడం కష్టమన్నారు.

ఉద్వేగ ప్రసంగం

ఉద్వేగ ప్రసంగం

అమెరికా అధ్యక్షులు ఒబామా ఉద్వేగభరిత వీడ్కోలు పలికారు. ఎనిమిదేళ్ల పాటు దేశ శ్రేయస్సు కోసం తాను చేయగలిగిందంతా చేశానని చెప్పారు. జాతి వివక్ష, అసమానతలతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

వివక్ష

వివక్ష

ముస్లిం అమెరికన్ల పట్ల వివక్షను తాను వ్యతిరేకిస్తానంటూ పరోక్షంగా తదుపరి అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌కు చురకలంటించారు. ఇన్నేళ్ల పాలనలో తనకు సహకరించినందుకుగాను ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

జాతి వివక్షపై..

జాతి వివక్షపై..

నల్లజాతీయుడినైన నేను 2008లో తొలిసారిగా దేశాధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో, జాతి వివక్ష లేని కాలంలోకి అమెరికా అడుగుపెట్టిందని అంతా చర్చించుకున్నారని, అయితే, ఇప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదని ఒబామా అన్నారు.

చికాగోలో..

చికాగోలో..

తన సొంత పట్టణమైన చికాగోలో ఏర్పాటుచేసిన ఈ సభకు దాదాపు ఇరవై వేలమంది మద్దతుదారులు హాజరయ్యారు. 55 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఒబామా స్పృశించారు.

అమెరికా ప్రగతి

అమెరికా ప్రగతి

ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న జాతి వివక్ష, అసమానతలపై పోరాటానికి పార్టీలకతీతంగా ప్రజలు ఏకమవ్వాలన్నారు. ఎనిమిదేళ్ల తన పాలనలో అమెరికా గతంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించిందని ఒబామా వెల్లడించారు.

ఆ దేశాలు సరితూగవు

ఆ దేశాలు సరితూగవు

ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఉన్న పలుకుబడితో రష్యా, చైనా వంటి ప్రత్యర్థి దేశాలు సరితూగలేవన్నారు. పొరుగున ఉన్న చిన్న దేశాలను వేధించే పెద్దన్నగా అమెరికా ఎన్నటికీ మారవద్దన్నారు. రాజ్యాంగ మూలాలు, పోరాట నిబంధనలకు కట్టుబడి ఉంటే అమెరికాను ఎవరూ ఓడించలేరన్నారు.

ఐసిస్ అంతం కాక తప్పదు

ఐసిస్ అంతం కాక తప్పదు

ఐసిస్ ఉగ్రవాదం అంతం కాక తప్పదని ఒబామా అన్నారు. అమెరికాకు ముప్పుగా పరిణమించేవారెవ్వరూ సురక్షితంగా ఉండబోరన్నారు. ఒసామా బిన్‌ లాడెన్‌ సహా వేలాదిమంది ఉగ్రవాదులను తుదముట్టించిన విషయాన్ని గుర్తు చేశారు.

మిచెల్లీ పైన..

మిచెల్లీ పైన..

తన సతీమణి మిచెల్లీ ఒబామాకు బరాక్‌ ఒబామా వీడ్కోలు ప్రసంగంలో థ్యాంక్స్ తెలిపారు. తన రాజకీయ కలలను సాకారం చేసేందుకు నీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిందని, తన భార్యగా, తన పిల్లలకు తల్లిగా గత 25 ఏళ్లలో ఆమె సేవలు నిరుపమానమన్నారు. ఆ సమయంలో అక్కడున్న వారు నిలబడి కరతాళ ధ్వనులతో మిషెల్‌ను అభినందించారు.

ధన్యవాదాలు

ధన్యవాదాలు

కుమార్తెలు సాషా, మాలియాలకు, పాలనలో తనకు అండగా నిలబడిన దేశ ప్రజలకు, ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు ఒబామా ధన్యవాదాలు తెలిపారు. ప్రసంగం ముగింపులో మరింత ఉద్వేగానికి గురైన ఒబామా.. ఆహూతుల విశేష స్పందన నడుమ కంటతడి పెట్టారు.

English summary
Outgoing President Barack Obama used his farewell address to praise his two daughters as his proudest achievement -- but one was missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X