వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ డే: 88ఏళ్ల తర్వాత క్యూబాలో అమెరికా అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

హవానా: సుమారు ఎనిమిది దశాబ్దాల ప్రతిష్ఠంభనకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడి స్థానంలో క్యూబా గడ్డపై కాలుమోపారు బరాక్ ఒబమా. అర్ధ శతాబ్ధానికి పైగా కొనసాగుతున్న విరోధాన్ని పక్కనపెట్టి తమ దేశ పర్యటనకు వచ్చిన బరాక్ ఒబామాకు క్యూబన్లు ఘన స్వాగతం పలికారు. హవానాలోని విప్లవ భవనంలో క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోతో సమావేశమైన ఒబామా చరిత్రాత్మకమైన చర్చలు జరిపారు.

1928 తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు క్యూబాలో పర్యటించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 1959లో క్యూబాలో విప్లవం అనంతరం కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి నుంచి అమెరికా ఆ దేశంపై నిర్బంధం కొనసాగిస్తోంది. కాగా, ప్రజల మంచి కోసం విభేదాలన్నీ పాతిపెట్టేందుకు తాము సిద్ధమని కాస్ట్రో ప్రకటించారు. ఇదొక కొత్త శకమని అన్నారు.

Barack Obama, Raul Castro hail 'new day' for US-Cuba relations

శనివారం సాయంత్రమే హవానా చేరుకున్న ఒబామా వర్షంలో తడుస్తూనే నగరంలో పర్యటించారు. క్యూబా స్వాతంత్య్ర సమరయోధుడు జోస్ మార్టీ సమాధి వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. క్యూబన్లను ఉద్దేశించి ఒబామా టీవీలో ప్రసంగిస్తారని, ఆ తర్వాత బేస్‌బాల్ పోటీని తిలకిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఒబామా పర్యటనతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక, రాజకీయపరమైన ఆంక్షలు తొలగుతాయని క్యూబన్లు ఆశిస్తున్నారు. అమెరికాకు, క్యూబాకు మధ్య 90 మైళ్ల దూరమే ఉన్నప్పటికీ 88 ఏళ్లు ఉభయ దేశాల మధ్య అధికారిక సంబంధాలు లేవు. ఫ్లారిడానుంచి గంట ప్రయాణం అనంతరం భార్య, ఇద్దరు కూతుళ్లతో హవానాలో దిగిన ఒబామా.. క్యూ బోలా క్యూబా (వాట్సాప్ క్యూబా) అని స్థానిక భాషలో ట్వీట్ చేశారు.

Barack Obama, Raul Castro hail 'new day' for US-Cuba relations

క్యూబా రావడానికి 1928లో అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ రైలు, పడవ ప్రయాణానికి మూడు రోజులు పట్టింది అని పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన పర్యటన అని హవానాలో పునఃప్రారంభించిన అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందినుద్దేశించి అన్నారు.

Barack Obama, Raul Castro hail 'new day' for US-Cuba relations

ప్రపంచ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తూ డిసెంబర్ 2014లో ఒబామా, కాస్ట్రోలు తమ దేశాల మధ్య సంబంధాలు ఇక మెరుగుపడతాయని ప్రకటించారు. అయితే ఇంతవరకు క్యూబాపై విధించిన ఆర్థిక ఆంక్షలను అమెరికా ఎత్తివేయలేదు. ఇందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

English summary
Barack Obama and his Cuban counterpart Raul Castro vowed on Monday in Havana to set aside their differences in pursuit of what the US president called a "new day" for the long bitterly divided neighbors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X