వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చివరి కానుక ఇదే!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి దిగిపోనున్న బరాక్ ఒబామా అధ్యక్షుడిగా భారతదేశానికి తన చివరి కానుకను అందజేశారు. అదేంటంటే.. అమెరికా తన అతిపెద్ద రక్షణ భాగస్వామిగా భారత్‌ను గుర్తించడం. భారత్‌కు అవసరమైన రక్షణ, సైనిక పరికరాలను ఉదారంగా సరఫరా చేయాలని ఒబామా ప్రభుత్వం రానున్న ట్రంప్ ప్రభుత్వానికి ఎజెండాగా నిర్దేశించింది.

అంతేగాకుండా ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా సూచించింది. భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ బాల్డ్‌విన్ కార్టర్ గురువారం నాడు భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను కలుసుకొన్నప్పుడు ఈ అంశాల గురించి ప్రస్తావించారు.

భారీ ఎత్తున భారత్‌కు రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని, సైనిక పరికరాలను ఎగుమతి చేయడానికి అమెరికా ప్రభుత్వం లెసైన్స్ నిబంధనలను ఖరారు చేసిందని ఆయన చెప్పారు. అమెరికా తన సన్నిహిత రక్షణ భాగస్వామ్య దేశాల సరసనే భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామి దేశంగా గుర్తిస్తూ గత జూన్ నెలలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Barack Obama's Parting Gift To India

అమెరికా రక్షణ మంత్రిగా పదవి నుంచి దిగిపోనున్న కార్టర్, మనోహర్ పరీకర్‌తో భేటీ అవడం ఇది ఏడోసారి. బహూశా ఇదే ఆఖరి సారి కూడా కావచ్చు. అతిపెద్ద రక్షణ భాగస్వామిగా భారత్‌ను తాము సగౌరవంగా గుర్తిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నామని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కార్టర్ వ్యాఖ్యానించారు. అలాగే అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణంలో భారత్ మరింత చురుకై న పాత్రను నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని కూడా ఆయన అన్నారు.

అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పటికే భారత్ పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల పేరిట త మ ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటోందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఇది అంత అబద్ధమని అఫ్ఘానిస్థాన్‌లో భారత్ నిర్వహిస్తున్న నిర్మాణాత్మక పాత్రను అమెరికా గుర్తించిందని కూడా కార్టర్ వెల్లడించారు. అంతేగాక, పాకిస్థన్.. టెర్రిరిస్తు సంస్థలను ప్రోత్సహించే చర్యలకు స్వస్తి పలకాలని ఘాటుగా సూచించారు. కాగా, జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. భారత్, పాకిస్థాన్ పట్ల తన వైఖరిని ఎలా కొనసాగిస్తారోనన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

English summary
The outgoing Obama administration has proposed an exceptionally liberal export control regime for the incoming Trump presidency for transfer of defence technology to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X