వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు తగ్గని ఆదరణ: ట్విట్టర్‌ చరిత్రలోనే రికార్డు

ఒబామాకు ఆదరణ తగ్గలేదని తేలిపోయింది.ట్విట్టర్‌లో ఒబామా ట్వీట్‌కు లక్షలాది మంది రెస్పాండ్ అయ్యారు.ట్విట్టర్ చరిత్రలోనే ఈ ట్వీట్ చరిత్ర సృష్టించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సోషల్‌మీడియాలో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. అమెరికా అధ్యక్షుడిగా బాద్యతల నుండి తప్పుకొన్నా ఒబామా చేసే ట్వీట్లకు భారీ స్పందన వస్తోంది.

వర్జీనియా రాష్ట్రంలోని చార్లెట్‌విల్ నగరంలో ఇటీవల జరిగిన దాడులపై స్పందిస్తూ ఒబామా ట్వీట్ ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది.

దక్షిణాఫ్రికా జాతిపి నెల్సన్ మండేలా జీవిత చరిత్ర 'లాంగ్ వాక్ టూ ఫ్రీడం' పుస్తకంలోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఒబామా ట్వీట్ చేశారు. మనుషుల మధ్య ఉండాల్సింది విద్వేషం కాదని, ప్రేమని బోధిస్తున్న వ్యాఖ్యలను మూడు ట్వీట్లుగా పెట్టారు.

Barack Obama’s post-Charlottesville tweet is the most ‘liked’ in history

మేరీల్యాండ్‌లో 2011లో తీసిన పోటోను మొదటి ట్వీట్‌లో పోస్ట్ చేశారు. దీనికి 28 లక్షల లైకులు వచ్చాయి. 11 లక్షలకుపైగా రీ ట్వీట్ చేశారు. ఒబామా ట్వీట్‌కు 45వేలకు పైగా సమాధానమిచ్చారు.

ట్విట్టర్ చరిత్రలోనే అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా రికార్డులకెక్కింది ఈ ట్వీట్. పాప్‌స్టార్ అరియానా గ్రాండే ట్వీట్‌ను వెనక్కు నెట్టిందని ట్విట్టర్ అధికార ప్రతినిధి ప్రకటించారు.

మే నెలలో మాంచెష్టర్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌పై ఆత్మాహుతి దాడి చేసిన సమయంలో దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ అరియానా ట్వీట్‌కు అత్యధిక లైకులు అప్పట్లో వచ్చాయి.

కాగా, చార్లెట్‌విల్‌లో అతివాద శ్వేత జాతీయులకు , మితవాదులకు మధ్య శుక్ర, శనివారాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు.

English summary
Former US President Barack Obama’s tweet in response to the violence in Charlottesville, Virginia, over the weekend has become the platform’s most liked post of all time. The southern university town witnessed violent protests as a white supremacist, alt-right clashed with leftist protestors over the removal of a Confederate statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X