వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయవద్దు: చివరి ఇంటర్వ్యూలో ఒబామా

అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా తుది ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయవద్దని అమెరికన్లను హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా తుది ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయవద్దని అమెరికన్లను హెచ్చరించారు.

ఒక విషయం మాత్రం తనకు చాలా గర్వంగా ఉందని, ఆధునిక చరిత్రలో వైట్ హౌస్ నుంచి ఎలాంటి కుంభకోణాల మచ్చ లేకుండా తమ ప్రభుత్వం బయటపడుతోందన్నారు. ఆ విధంగా చూస్తే తాము కొన్ని విషయాలు మార్చినట్లే అన్నారు.

Barack Obama

చరిత్రలోనే అధ్యక్ష పదవి అధికార మార్పిడికి సంబంధించి ఇది అసాధారణ ఘట్టమన్నారు. ఎన్నికైన అధ్యక్షుడు కూడా తనతో ఏకీభవిస్తారని భావిస్తున్నానన్నారు. ట్రంప్‌ అసాధారణ అభ్యర్థి అని, ఆయనలాగా విజయవంతంగా ఇటీవలి కాలంలో ఇంకెవరూ ప్రచారం చేయలేదన్నారు.

ట్రంప్‌కి ఆయన పార్టీలో మద్దతు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రచారం లాగే ఆయన ప్రభుత్వాన్నీ నడపగలరా అన్న ప్రశ్నపై మాట్లాడుతూ.. ఇప్పుడు ట్రంప్ ఓ వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది పరీక్ష లాంటిదని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు.

ఒబామా ఉద్వేగం, కంటతడి: చిన్న కూతురు ఎక్కడ?ఒబామా ఉద్వేగం, కంటతడి: చిన్న కూతురు ఎక్కడ?

ట్రంప్ పైన ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని, కానీ తన వరకు మాత్రం ఆయనను తక్కువగా అంచనా వేయవద్దని చెబుతానన్నారు. ఆయన అమెరికాకి 45వ అధ్యక్షుడన్నది మరిచిపోవద్దన్నారు. తనవంతుగా అధికారంలోకి వస్తున్న రిపబ్లికన్లకు ఆయన కొన్ని సూచనలు చేశారు.

English summary
Barack Obama warns Americans not to 'underestimate' Donald Trump in final interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X