వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరాక్ ఒబామా ఒక అసమర్థుడు, ఇక అంతే: అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తన తాజా ప్రసంగంతో ప్రజల ప్రశంసలందుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటంలో విఫలమయ్యారంటూ ఒబామా చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించాయి.

Recommended Video

Donald Trump - 'Barack Obama Was A Grossly Incompetent President'

కమ్ బ్యాక్ ఒబామా: కరోనాపై అదరగొట్టే స్పీచ్ ఇచ్చిన బరాక్: అమెరికన్ల ఫిదా: ట్రంప్‌పై సెటైర్లుకమ్ బ్యాక్ ఒబామా: కరోనాపై అదరగొట్టే స్పీచ్ ఇచ్చిన బరాక్: అమెరికన్ల ఫిదా: ట్రంప్‌పై సెటైర్లు

ఒబామాపై ఆగ్రహం..

ఒబామాపై ఆగ్రహం..

శనివారం ఓ గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవంలో ఒబామా మాట్లాడుతూ.. అమెరికాలో కరోనా కట్టడిపై స్పందించారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్.. ఒబామాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒబామా ఒక అసమర్థుడు..

ఒబామా ఒక అసమర్థుడు..

బరాక్ ఒబామా ఒక అసమర్థ అధ్యక్షుడు.. ఆయన గురించి అంతకన్నా ఏం చెప్పలేను అంటూ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఒబామా గానీ, ఆయన కార్యాలయం గానీ స్పందించలేదు. 2017లో అధ్యక్షుడిగా దిగిపోయాక ఒబామా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన మీడియా ముందుకు వస్తున్నారు.

ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారంటూ ఒబామా..

ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారంటూ ఒబామా..

శనివారం ఓ ఆన్‌లైన్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఒబామా విమర్శించారు. ఈ కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను నాశనం చేసిందని అన్నారు. పరిస్థితి అంతా తలకిందులైందని వ్యాఖ్యానించారు. కాగా, ఒబామా చేసిన ప్రసంగం అమెరికా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉండివుంటే ఇంత భారీ నష్టం జరిగేది కాదని అంటున్నారు. కొందరైతే మరోసారి ఒబామాను అధ్యక్షుడిగా చూడాలని కోరుతున్నారు.

అమెరికాలో లక్షకు చేరువలో మరణాలు..

అమెరికాలో లక్షకు చేరువలో మరణాలు..

కాగా, కరోనాతో అమెరికాలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. అమెరికాలో ఇప్పటి వరకు 15,27,664 కరోనా కేసులు నమోదు కాగా, 90,978 మంది మరణించారు. 3,46,389 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో 10,900,297 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ట్రంప్ విధానాల వల్లే అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోందని విమర్శులు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
US President Donald Trump on Sunday called his predecessor Barack Obama a ‘grossly incompetent president'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X