వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాప్టర్ ప్రమాదంలో ఎన్బీఏ స్టార్ దుర్మరణం: అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదం: ట్రంప్, ఒబామా

|
Google Oneindia TeluguNews

Recommended Video

RIP Kobe Bryant : Basketball Legend Kobe Bryant Lost Life In A Helicopter Cr@sh || Oneindia Telugu

న్యూయార్క్: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా జాతీయ బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు కోబె బ్రియాంట్, ఆయన కుమార్తె గియానా మారియా దుర్మరణం పాలయ్యారు. వారితో మరో ముగ్గురు ఈ ఘటనలో మరణించారు. కోబె బ్రియాంట్ మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమెరికా క్రీడారంగ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు.

కుప్పకూలిన హెలికాప్టర్..

బ్రియాంట్, ఆయన 13 సంవత్సరాల కుమార్తె బ్రియాంట్ సహా మరో ముగ్గురితో కలిసి ప్రయాణిస్తోన్న హెలికాప్టర్.. లాస్‌ఏంజిలిస్ సమీపంలోని క్యాలబసస్ ప్రాంతంలోని పర్వతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవ్వరూ ప్రాణాలతో బయట పడలేదని లాస్ఏంజిలిస్ పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ దిశగా తాము దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

గాలిలోనే పేలిపోయి..

41 సంవత్సరాల బ్రియాంట్ కొద్దిరోజుల కిందటే రిటైర్డ్ అయ్యారు. అమెరికా స్టార్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిలడెల్ఫియాలో జన్మించిన బ్రియాంట్.. జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్‌కు ప్రాతినిథ్యాన్ని వహించారు. తన కుమార్తె, మరో ముగ్గురితో కలిసి ఓ ప్రైవేటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా.. అది ప్రమాదానికి గురైంది. క్యాలబసస్ పర్వతాల మీదుగా వెళ్తున్న సమయంలో కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ గాలిలోనే పేలిపోయినట్లు అనుమానిస్తున్నారు.

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ట్రంప్, ఒబామా

ఈ ఘటన అమెరికన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రియాంట్ మరణించారనే వార్తను వినాల్సి వస్తుందని తాము అనుకోలేదని వారు వ్యాఖ్యానించారు. బ్రియాంట్ మరణం తీవ్రంగా కలిచి వేస్తోందని ఒబామా పేర్కొన్నారు. ఈ వార్తను తాము నమ్మలేకపోతున్నామని పలువురు బాస్కెట్‌బాల్ క్రీడాకారులు అంటున్నారు. బాస్కెట్ బాల్‌కు దేవుడిగా ఆయనను అభివర్ణిస్తున్నారు.

English summary
Basketball star Kobe Bryant and his 13-year-old daughter Gianna Maria died in a helicopter crash in Calabasas, California, on Sunday morning, a local tabloid reported without citing a source. It said Kobe Bryant was traveling with at least three other people, including his daughter, in his private helicopter when it went down in Calabasas, about 40 miles (65 km) northwest of Los Angeles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X