వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సహా ప్రాంతీయభాషల్లో విస్తరించనున్న బిబిసి

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్ :ప్రసిద్ది చెందిన మీడియా సంస్థ తన సామ్రాజ్యాన్ని విస్తరించనుంది. బ్రిటన్ లో కాకుండా అతిపెద్ద బ్యూరోను డిల్లీలో ఏర్పాటు చేయనుంది బిబిసి. దేశంలోని తెలుగుసహా మరో మూడు భాషల్లో బిబిసి చానళ్ళలను ప్రారంభించనుంది.

ప్రపంచంలో బిబిసికి మంచి పేరుంది. ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని 11 బాషల్లో తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది.ఈ మేరకు భారత్ లో నాలుగు ప్రాంతీయ భాషల్లో ఈ చానల్ తను సేవలను బుదవారం నాడు ప్రారంభించింది. తెలుగు సహా గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో ఈ చానల్ తన సేవలను ప్రారంభించింది.వీటికి తోడు ఆఫ్రికాలో ఏడు భాషల్లో తనసేవలను విస్తరించనుంది.

 bbc expands in 11 regional languages

జర్నలిజంలో స్వతంత్ర ,నిష్పాక్షికమైన సేవలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. లండన్ తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న బ్యూరోను డిల్లీలో ఏర్పాటు చేయనుంది. భారత్ లో తన చానళ్ళ విస్తరణ ద్వారా కొత్తగా 157 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.

1922 లో స్థాపించిన బిబిసి వరల్డ్ సర్వీస్, 1940 తర్వాత అతి పెద్ద విస్తరణ ఇదేనని ఆ సంస్థ ప్రకటించింది. యువత, మహిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని బిబిసి చానల్ తన విస్తరణను ప్లాన్ చేసింది. అంతేకాదు భారత్ లోని అన్ని భాషల్లో డిజిటల్ టివి వీడియో ఔట్ పుట్ సేవలను బిబిసి లాంచ్ చేయనుంది.ఇంగ్లీష్ సహా 40 భాషలకు బిబిసి విస్తరించింది.

English summary
bbc expantions in asian, africa.11 regional languages bbc will lannches new channels.telugu, gujarati, punjabi, marathi languages channels lanch on monday. another 7 languges in afrcia.outside london biggest news bueuro will be establish in delhi. another 157 members wiil be get employement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X