వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న: ఆల్కహాల్‌లోనే ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువట..!

|
Google Oneindia TeluguNews

పాలు తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వం చెప్పే మాటలు ఇవి. రోజు లేవగానే ఒక గ్లాసుడు పాలు తాగాలని పిల్లలకు పెద్దలు చెబుతుంటారు. పాలు గురించి ప్రస్తావన వస్తే పెద్దల మది అంతా చిన్ననాటి జ్ఞాపకాలతో నిండిపోతుంది. పాలు తాగాలంటూ తల్లులు గ్లాస్ పట్టుకుని వెనకాల పరిగెత్తడం వంటివి గుర్తుకువస్తాయి. ఎందుకంటే పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటామనేది వారి ఫిలాసఫీ. కానీ ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ మాత్రం పాలల్లో కంటే బీర్‌లోనే అధికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటూ ఓ ప్రకటనలో వెల్లడించింది.

పెగ్గు బీర్ బెస్ట్ అంటున్న పెటా

పెగ్గు బీర్ బెస్ట్ అంటున్న పెటా

అవును పెటా విడుదల చేసిన ప్రకటన చూస్తే పాలు తాగడం మానేసి పెగ్గు బీరు తాగడం మొదలు పెడుతారు. పాలల్లో కంటే బీర్‌లోనే అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ పెటా విడుదల చేసిన ఓ ప్రకటనలో ద్వారా తెలుస్తోంది. అంతేకాదండోయ్... పెటా ఇది ఆషామాషీగా చెప్పిన సంగతి కాదు. ఏకంగా హార్వర్డ్ మెడికల్ స్కూలు పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా ఈ సంగతిని వెల్లడించింది. ఆరోగ్యం విషయానికొస్తే పాలకంటే బీర్‌ చాలా మంచిదని పెటా గంటాపథంగా చెబుతోంది. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేసింది.

ఆరోగ్య పరంగా పాలతో పెద్దగా ఉపయోగం లేదు

ఆరోగ్య పరంగా పాలతో పెద్దగా ఉపయోగం లేదు

పాలతో పోల్చుకుంటే బీర్‌ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు పెటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ రీమాన్. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిదన్నారు. ఓ వైపు ఆరోగ్య పరంగా పాలతో పెద్దగా ఉపయోగం లేదని తెలిసి కూడా పాలను తీసుకోవడం తెలివైన పనికాదని ట్రేసీ చెబుతున్నారు. అంతేకాదు పాలకోసం కొన్ని బిలియన్ ఆవులను గేదెలను హింసిస్తున్నామని ఆయన చెప్పారు.

 పాలతో వ్యాధులు.. బీరుతో బోన్స్ బలోపేతం

పాలతో వ్యాధులు.. బీరుతో బోన్స్ బలోపేతం

డెయిరీ ప్రాడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పెటా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్‌లాంటి వ్యాధులు డెయిరీ ఉత్పత్తులతో వచ్చే ప్రమాదం ఉందని పెటా హెచ్చరిస్తోంది. అంతేకాదు వీటితో పాటు మరిన్ని సీరియస్ జబ్బులు కూడా సోకే ఛాన్సెస్ ఉన్నాయని పెటా చెబుతోంది. అంతేకాదు డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధి కూడా సోకుతుందని చెప్పిన పెటా... దీన్ని నిర్థారిస్తూ రుజువులు కూడా సమర్పించింది. అయితే బీర్ తాగడం వల్ల ఎముకలను బలోపేతం చేస్తుందని దీనివల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పెటా పేర్కొంది.

మొత్తానికి పెటా చెప్పినట్లుగా పాలకు స్వస్తి పలికి బీర్ గ్లాస్ చేత పట్టుకుంటే ఇటు ఆనందంతో పాటు అటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయట. ఈ వార్త మందుబాబులకు వింటేనే కచ్చితంగా కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary
PETA (People for the Ethical Treatment of Animals) stated in an advertisement that Beer is healthier than milk and they used studies by Harvard Medical School to back their statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X