వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"పాలు తాగితే రోగాలు.. బీరు తాగితేనే ఆరోగ్యం"

|
Google Oneindia TeluguNews

విస్కాన్సిన్ : "పాలు బలవర్థక ఆహారమని భావిస్తున్నారు. కానీ, పాల కంటే బీరు తాగడమే చాలా మేలు. పైగా.. పాలు తాగడం వల్ల ఒబేసిటీ, డయాబెటీస్, కేన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. ఇవన్నీ గాక ఎముకలు గుల్లబారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అదే బీరు తాగారనుకోండి.. ఎముకల పటుత్వం పెరగడంతో పాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుంది."

ఇవన్నీ ఎవరో వ్యక్తి చెప్పిన మాటలు కాదు. వణ్య ప్రాణుల సంరక్షణ సంస్థ పెటా వెల్లడించిన విషయాలు. జంతు సంబంధ ఉత్పత్తులను పూర్తిగా వ్యతిరేకించే పెటా ఇలాంటి ప్రకటనలు చేయడం పెద్ద ఆశ్చర్యం అనిపించకపోవచ్చు. ఈ విషయాలన్ని శాస్రీయంగా రుజువు చేయబడ్డవని పెటా ప్రకటించడం గమనార్హం.

ఆరోగ్యం కోసమే పాల ఉత్పత్తులనే వినియోగించాల్సిన అవసరం లేదని చెబుతోన్న పెటా.. పాల కోసం లక్షలాది ఆవులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాల వినియోగం తగ్గితే ఆవులను హింసించడం తగ్గుతుందన్న ఉద్దేశ్యంతోనే బీరు ప్రచారాన్ని తెరమీదకు తెచ్చినట్లు పెటా కార్యవర్గ ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమాన్ తెలిపారు.

Beer healthier than milk, says PETA

అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ మాడిసన్ క్యాంపస్ కు సమీపంలోని హిల్ డేల్ మాల్ వద్ద 'గాట్ బీర్' పేరిట బిల్ బోర్డును ఏర్పాటు చేసిన పెటా.. ఈ విషయాలను అధికారికంగా ప్రకటించింది. పాలు తాగడం కంటే బీరు సేవించడమే ఆరోగ్యానికి మంచిదని పెటా తెలిపింది. 'పాలు మానండి, బాధ్యతగా బీరు తాగండి' అన్న నినాదంతో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.

కాగా, గతంలోను బీరుకు మద్దతుగా పెద్ద ఎత్తున్నే ప్రచారం చేసింది పెటా. అయితే దీనిపై చాలా చోట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో పెటా వెనకడుగు వేయక తప్పలేదు.

English summary
Beer is healthier than milk, People for the Ethical Treatment of Animals (PETA) has claimed in Madison, Wisconsin, also known as America's Dairyland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X