• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కారు కొన్న మహిళ కాయిన్స్ ఇచ్చింది.. 66 సంచుల్లో చిల్లర.. లెక్క పెట్టలేక..!

|

బీజింగ్‌ : వంద రూపాయల నోటు ఇచ్చి 10 రూపాయల వస్తువు కొంటే.. దుకాణ యజమాని మొహం మాడిపోతుంది. ఇంతదానికి అంత చిల్లర ఇవ్వాలా అంటూ చీదరించుకుంటాడు. ఇలాంటి ఘటనలు ప్రతిచోట నిత్యకృత్యమే. అయితే లక్షల కొద్దీ చిల్లర కాయిన్స్ ఇచ్చి కారు కొనుక్కునేందుకు వెళ్లిన మహిళను చూసి షోరూమ్ వాళ్లు బిత్తరపోవడం చర్చానీయాంశమైంది.

కారు కొనడానికి చిల్లరంతా పోగేసి..!

కారు కొనడానికి చిల్లరంతా పోగేసి..!

కారు సెలెక్ట్ చేసుకునేంత వరకు డబ్బు ఊసెత్తని సదరు మహిళ.. తీరా కారు ఓకే చేశాక తన వెంట తెచ్చిన బ్యాగుల వైపు వేలు చూపేసరికి అక్కడి సిబ్బంది కంగు తిన్నారట. 66 బ్యాగుల్లో నింపుకొచ్చిన కాయిన్స్ చూసి వాళ్లకు దిమ్మ తిరిగి పోయిందట.

చైనాలోని కాన్‌జావ్‌కు చెందిన ఓ మహిళ కారు కొందామని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో ఫోక్స్ వాగన్ షోరూమ్‌కు వెళ్లి నచ్చిన కారు ఎంపిక చేసుకున్నారు. దానికోసం ప్రాసెస్ అంతా పూర్తి చేసి చెక్ కావాలంటూ అడిగిన సిబ్బందికి ఆమె చెప్పిన సమాధానం కంగు తినిపించింది. ఆటోలో తీసుకొచ్చిన 66 బ్యాగులను తీసుకోవాలంటూ వారికి సూచించింది.

------------------------

అమెరికాలో హరీష్ రావు.. ఆయన తీరు మారిందంటూ కామెంట్స్..!

 17 మంది.. 3 రోజులు.. లెక్కపెట్టేసరికి దిమ్మతిరిగే..!

17 మంది.. 3 రోజులు.. లెక్కపెట్టేసరికి దిమ్మతిరిగే..!

దాదాపు పదేళ్లుగా ఆమె దాచుకున్న చిల్లర డబ్బునంతా పోగేసి 66 సంచుల్లో నింపుకొచ్చారు. వాటితో కారు కొనాలనేది ఆమె ఆలోచన. ఆ మేరకు షోరూమ్ సిబ్బందికి వాటిని అప్పగించారు. ఏమి చేయాలో తెలియక, కాదనలేక, ఉసురుమంటూ వాటిని తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి వాళ్ల బాధ వర్ణనాతీతం.

ఒక్కో సంచి విప్పుతూ ఆ చిల్లర కాయిన్స్ లెక్కించడానికి 17 మంది సిబ్బంది మూడు రోజులు తెగ కష్టపడ్డారట. అదేపనిగా కాయిన్స్ లెక్కపెట్టడంతో వారి చేతులు కందిపోయాయి.

 డిపాజిట్ కోసం.. బ్యాంకుకు అదే చిల్లర

డిపాజిట్ కోసం.. బ్యాంకుకు అదే చిల్లర

చిల్లరనంతా లెక్కించాక భద్రంగా బ్యాంకుకు తరలించి డిపాజిట్ చేశారు. వీళ్ల తిప్పల్లాగే ఆ బ్యాంకు వాళ్లు కూడా ఎంత కష్టపడ్డారో మరి. అయితే షోరూమ్ సిబ్బంది ఆ చిల్లరనంతా లెక్కిస్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విస్ట్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా కనపడని ఈ చిల్లర బాధలు ఒక్క చైనాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో కూడా ఇలాంటివి అనేక సంఘటనలు వెలుగుచూశాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in Beizing shocked staff at a local car dealership when she turned up at the showroom with 66 bags of cash to buy a car. The bags were full of coins. But the tricky part was when employees stressed and their hands were painful with black smash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more