• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీరట్ పేలుళ్లు : కోలుకోనివ్వని దెబ్బ... విషాదాలు,విధ్వంసాలు... లెబనాన్‌ గురించి మీకు తెలియని విషయాలు

|

లెబనాన్‌... జనాభాలో హైదరాబాద్ కన్నా చిన్న దేశం. విస్తీర్ణంలో భారత్‌లోని అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురతో సరితూగే దేశం. గతంలో అంతర్యుద్దం కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన దేశం. లెబనాన్ గురించి అంతర్జాతీయ సమాజం ఎరుకలో ఉన్నది ఎక్కువగా అంతర్యుద్ధాలు,ప్రాంతీయ సంఘర్షణలు,విషాదాలే. తాజా బీరట్ పేలుళ్లు లెబనాన్‌కు కోలుకోని దెబ్బ. అసలే వరుస విషాదాలతో సతమతమవుతున్న ఆ దేశంలో తాజా పేలుళ్లు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. వాదీ సాదెహ్ అనే లెబనీస్ ఆస్ట్రేలియన్ కవి అంతర్యుద్దంతో చిధ్రమైన లెబనాన్ విషాదాలపై రాసిన కవిత్వం చదివితే అక్కడి పరిస్థితులు ఎంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయో అర్థమవుతుంది.

  Lebanon : పేలుడు తో ఎలాంటి సంబంధం లేదన్న Israel | అమ్మోనియం నైట్రేట్ వల్లే నా? || Oneindia Telugu
  అంతర్యుద్దంతో నలిగిపోయిన లెబనాన్...

  అంతర్యుద్దంతో నలిగిపోయిన లెబనాన్...

  సిరియా ఆధిపత్యానికి వ్యతిరేకంగా లెబనాన్‌లో 1975, 2005లో చెలరేగిన అంతర్యుద్దం 2005లో సిరియన్ దళాలను ఆ దేశం నుంచి ఉపసంహరించుకునేంతవరకూ కొనసాగింది. సిరియా అనుకూల,వ్యతిరేక శిబిరాల మధ్య అసమ్మతి కారణంగా చాలాకాలం పాటు అక్కడ రాజకీయ వ్యవస్థలు స్తంభించిపోయాయి. సిరియా ఆధిపత్యం,ఆ దేశంతో విబేధాలతో కారణంగా... లెబనాన్ రాజధాని బీరట్,ఇరత ప్రాంతాల్లో ఎన్నోసార్లు దాడులు జరిగాయి.

  రాజకీయ పరిస్థితులు....

  రాజకీయ పరిస్థితులు....

  సుమారు 10వేల చదరపు కి.మీ విస్తీర్ణం, దేవదారు చెట్టును తమ జెండాపై ముద్రించుకున్న ఈ దేశం... మధ్యప్రాచ్య దేశాల్లో అతిచిన్న దేశంగా ఉన్నది. పశ్చిమాన మధ్యదరా సముద్రాన్ని కలిగిన ఈ దేశం.. సిరియా,ఇజ్రాయెల్‌లతో సరిహద్దులను పంచుకుంటోంది. లెబనాన్‌లో 18 ముఖ్యమైన మతాలు ఉండగా... ఇందులోని కీలక వర్గాలు ప్రభుత్వ అధికారాన్ని పంచుకునే ఒప్పందం కుదుర్చుకున్నాయి. 128 మంది సభ్యులను కలిగి ఉన్న లెబనాన్ పార్లమెంటు ముస్లింలు,క్రిస్టియన్ల మధ్య సమానంగా విభజించబడింది.

  అప్పటి జాతీయ ఒప్పందం ప్రకారం...

  అప్పటి జాతీయ ఒప్పందం ప్రకారం...

  1943లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత కుదిరిన జాతీయ ఒప్పందం ప్రకారం లెబనాన్‌లో తప్పనిసరిగా అధ్యక్షుడు మెరోనైట్ క్రిస్టియన్ అయి ఉండాలి. అలాగే ప్రధాని మంత్రి తప్పనిసరిగా సున్నీ ముస్లిం,పార్లమెంట్ స్పీకర్ షియా ముస్లిం అయి ఉండాలి. 4.5 మిలియన్ల జనాభా కలిగిన లెబనాన్‌లో 1.5 మిలియన్ల మంది శరణార్థులే ఉన్నట్లు ఒక అంచనా. లెబనాన్‌లో సిరియా ఆధిపత్యం కారణంగానే ఈ వలసలు పెరిగాయన్న వాదన ఉంది. ఈ వలసలు దేశ ఆర్థిక వ్యవస్థ,సామాజిక వ్యవస్థలపై తీవ్ర భారాన్ని మోపుతాయని చాలాసార్లు అంతర్జాతీయ సంస్థలు లెబనాన్‌ని హెచ్చరించాయి.

  అప్పుల్లో కూరుకుపోయి... అభివృద్దికి దూరంగా...

  అప్పుల్లో కూరుకుపోయి... అభివృద్దికి దూరంగా...

  ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్న లెబనాన్ చరిత్రలో మొదటిసారిగా అప్పుల చెల్లింపులో చేతులెత్తేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ & పి) ప్రకారం లెబనాన్ 92 బిలియన్ల అప్పులో కూరుకుపోయింది. ఇది స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 170 శాతానికి సమానం.ప్రపంచంలోనే అత్యధిక రుణ నిష్పత్తుల్లో ఇది ఒకటి. దీనికి తోడు 2019 నుంచి లెబనాన్‌లో అవినీతి,అసమర్థ రాజకీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అంతర్యుద్దాలు,పెరిగిన అప్పులు,ప్రభుత్వ వైఫల్యం వెరసి అభివృద్దిలో చాలా వెనుకబడింది. చిన్న దేశమే అయినప్పటికీ ఇప్పటికీ విద్యుత్,నీటి అవసరాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

  English summary
  Lebanon, a small multi-confessional country which endured a devastating 15-year civil war, has often been caught in the crossfire of regional conflicts.The tragic explosions at Beirut port on Tuesday struck with the country mired in its worst economic crisis for decades, marked by the collapse of its currency and angry popular protests.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X