• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోదసీ యాత్ర అనంతరం కీలక ప్రకటన చేసిన బెజోస్ .. ఆ హీరోలకు "కరేజ్ అండ్ సివిలిటీ" అవార్డులు !!

|

తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన తరువాత మరో సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష యాత్ర ద్వారా సాహసం చేసిన జెఫ్ బెజోస్ తన అంతరిక్ష యాత్ర విజయానంతరం భూమి మీదకి తిరిగి వచ్చిన తరువాత భారీ అవార్డును ప్రకటించారు. కరేజ్ అండ్ సివిలిటీ పేరుతో 100 మిలియన్ డాలర్ల అవార్డును మానవజాతి సవాళ్లను ఎదుర్కోవడం కోసం ప్రజలను సమాయత్తం చేసే నాయకులకు ఇవ్వడం కోసం ప్రకటిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.

100 మిలియన్ డాలర్ల అవార్డును ఇద్దరికి ప్రకటించిన బెజోస్

100 మిలియన్ డాలర్ల అవార్డును ఇద్దరికి ప్రకటించిన బెజోస్


సుమారు 746.02 కోట్ల రూపాయల విలువైన ఈ అవార్డును ఆయన ఇద్దరికి ప్రధానం చేశారు. ఇక ఈ అవార్డును అందుకున్న విజేతలు ఎవరంటే ఒకరు అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత వాన్ జోన్స్ కాగా, మరొకరు ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్. ఈ అవార్డుల ద్వారా వస్తున్న సొమ్మును వారిద్దరూ కావాలంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొచ్చని బెజోస్ వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులను ఇస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అవార్డు గ్రహీత ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్.. ఆయనకు ఎందుకంటే

అవార్డు గ్రహీత ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్.. ఆయనకు ఎందుకంటే

అవార్డు పొందిన ఇద్దరిలో ఒకరు స్పానిష్ కి చెందిన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్, ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మానవతా వాదిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ప్రకృతి విపత్తుల బాధితులకు 2010లో ప్రారంభించిన ఈ వరల్డ్ సెంట్రల్ కిచెన్ ద్వారా ఆహారాన్ని అందించటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ ఆకలి తీర్చడం కోసం పని చేయడమే కాకుండా, స్థానిక చెఫ్ లను ఇందులో భాగస్వామ్యం చేసేలా వరల్డ్ సెంట్రల్ కిచెన్ పనిచేస్తుంది.

 వాన్ జోన్స్ కు కరేజ్ అండ్ సివిలిటీ అవార్డు .. ఆయన ఏం చేశారంటే

వాన్ జోన్స్ కు కరేజ్ అండ్ సివిలిటీ అవార్డు .. ఆయన ఏం చేశారంటే

ఇక బెజోస్ అవార్డును ప్రకటించిన రెండవ వ్యక్తి వాన్ జోన్స్ ప్రముఖ టీవీ హోస్ట్ గా, రచయితగా, రాజకీయ విశ్లేషకుడు గా, జోన్స్ షో వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ గా ఉన్నారు. జోన్స్ అనేక లాభాపేక్ష లేని సంస్థలను స్థాపించి నిర్వహించడంతో ఆయనకు సైతం అవార్డును ప్రకటించారు. ది డ్రీమ్ కార్ప్స్ అనే సంస్థ ద్వారా సమాజంలో అత్యంత హానికరమైన క్రిమినల్స్ ను సంస్క రిస్తూ, వారిలో ఉన్న శక్తియుక్తులను తెలుసుకొని, ప్రపంచానికి ఉపయోగపడే పలు ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూ వాన్ జోన్స్ వారిలో మార్పు కోసం కృషి చేస్తున్నారు.

మానవజాతి సవాళ్లను పరిష్కరించడం కోసం పనిచేసే సోషల్ హీరోలకు అవార్డులు

మానవజాతి సవాళ్లను పరిష్కరించడం కోసం పనిచేసే సోషల్ హీరోలకు అవార్డులు

ఇక వీరిద్దరికీ అవార్డులను ప్రకటించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలా మానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం కోసం ప్రజలను సమాయత్తం చేసే హీరోలను గుర్తించి వారికి అవార్డులను అందించనున్నట్టు జెఫ్ బెజోస్ వెల్లడించారు. న్యూ షెపర్డ్ వ్యోమనౌక లో నలుగురు సభ్యులతో కలిసి నింగిలోకి దూసుకెళ్లి, తిరిగి భూమికి చేరిన సంతోషంలో ఆయన ఈ అవార్డులను ప్రకటించడం గమనార్హం.

English summary
Jeff Bezos, who ventured through space travel, announced the huge award after returning to Earth after the success of his space mission. He revealed that he was announcing a $ 100 million award in the name of Courage and Civility for giving to leaders who prepare people to face the challenges of mankind. One of the two recipients of the award is renowned Spanish chef Jose Andres, while the other is American political commentator Van Jones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X