వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్‌ ఇంగ్లండ్‌ విజేతగా భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీ

|
Google Oneindia TeluguNews

యూకే: 23 ఏళ్ల భారత సంతతి డాక్టర్ మిస్ ఇంగ్లాండ్‌గా విజయం సాధించారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. భాషా ముఖర్జీకి రెండు మెడికల్ డిగ్రీలున్నాయి. ఐక్యూ 146, ఐదు భాషల్లో ప్రావీణ్యత ఆమె సొంతం. బోస్టన్‌లోని లింకన్‌షైర్‌లో ఆమె జూనియర్ డాక్టరుగా త్వరలో కెరీర్ ప్రారంభించాల్సి ఉండగా ఆలోపే మిస్ ఇంగ్లాడ్ కోసం జరిగిన పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు.

Bhasha Mukherjee, Indian origin doctor wins Miss England Crown

మోడల్స్ అంటే చాలా మంది తప్పుగా ఆలోచిస్తారని అయితే ఓ మంచి పనికోసం వారంతా నిలబడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని డాక్టర్ భాషా ముఖర్జీ పోటీకి ముందు వ్యాఖ్యానించారు. మెడికల్ స్కూలులో తాను విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసినట్లు చెప్పారు. అయితే ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు చాలా ఆలోచించాల్సి వచ్చిందని అన్నారు. అయితే చివరకు మోడలింగ్ వైపు అడుగులు వేస్తూనే తన చదువును విస్మరించలేదని చెప్పారు. రెండిటిని సమతూకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినట్లు ఆమె తెలిపారు.

Bhasha Mukherjee, Indian origin doctor wins Miss England Crown

ఇదిలా ఉంటే భాషా ముఖర్జీ భారత్‌లో జన్మించారు. 9 ఏళ్ల వరకు భారత్‌లోనే కాలం గడిపిన ఆమె ఆ తర్వాత తన కుటుంబం యూకేకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ప్రాథమిక ఉన్నత విద్యను ఆమె యూకేలోనే పూర్తి చేశారు. అనంతరం రెండు బ్యాచిలర్ డిగ్రీల పట్టాను పొందారు.ఒకటి మెడికల్ సైన్సెస్‌లో మరొక డిగ్రీ మెడిసిన్ మరియు సర్జరీలో యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్హామ్ నుంచి పొందారు. ఇక మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో విజేతగా నిలవడంతో ...భాషా ముఖర్జీ 2019 ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించినట్లయ్యింది. అంతేకాదు మారిషస్‌ ట్రిప్‌కూడా బహుమానంగా పొందింది.

English summary
Bhasha Mukherjee, a 23-year-old Indian origin doctor was crowned the Miss England 2019 recently. Bhasha holds two different medical degrees, has an IQ of 146 and is fluent in 5 different languages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X