• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డెమోక్రాట్లకూ కరోనా ముప్పు- అయినా వెనక్కి తగ్గని బిడెన్‌- కమలా హ్యారిస్‌ పర్యటనలు రద్దు

|

అమెరికా అధ్యక్ష ఎన్నికలను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్‌ క్యాంప్‌లో అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైట్‌హౌస్‌ అధికారులు వైరస్‌ బారిన పడటంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇప్పుడు ప్రత్యర్ధి జో బిడెన్‌ శిబిరంలోనూ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే డెమోక్రాట్ల ప్రచార సభ్యుల్లో ముగ్గురికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరు ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌తో కలిసి తిరిగిన వారే. వారికి కరోనా సోకిన తర్వాత కమల కూడా బిడెన్‌తో కలిసి తిరిగారు. దీంతో ఇప్పుడు ఎవరి ఆరోగ్య సమాచారం ఏంటో కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో అధ్యక్ష ఎన్నికలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

బిడెన్ ప్రచారం యథాతథం- కమలకు రెస్ట్‌..

బిడెన్ ప్రచారం యథాతథం- కమలకు రెస్ట్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రిపబ్లికన్‌, డెమోక్రాట్‌ ఇరు శిబిరాల్లోనూ కరోనా భయాలు వెంటాడుతున్నాయి.

తమ ప్రచార టీమ్‌లో వరుసగా మూడో కరోనా కేసు నమోదు కావడంతో డెమోక్రాట్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులు జో బిడెన్, కమలా హ్యారిస్‌ అప్రమత్తమయ్యారు. అయితే కరోనా సోకిన వారిని నేరుగా కలవకపోవడంతో అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆయన ప్రచార టీమ్‌ తెలిపింది. ఆయన ప్రచార షెడ్యూల్‌ యథావిథిగా కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌ మాత్రం తన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఆమె టీమ్‌లో ఇద్దరికి కరోనా సోకినందున ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆత్మరక్షణలో బిడెన్‌ శిబిరం..

ఆత్మరక్షణలో బిడెన్‌ శిబిరం..

ఇన్నాళ్లూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను లెక్కచేయకుండా తిరిగి వైరస్‌ బారిన పడిన నేపథ్యంలో అదే అంశంపై ఆయన్ను టార్గెట్‌ చేస్తున్న డెమోక్రాట్లకు తాజా పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. కరోనా వ్యాప్తికి ట్రంప్‌ను కారణంగా చూపుతూ ప్రచారం చేసుకుంటున్న డెమోక్రాట్లకు ఇప్పుడు తమ శిబిరంలోనే కేసులు బయటపడటంతో ఆత్మరక్షణలో పడక తప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా వైరస్‌ను ట్రంప్‌ను బాధ్యుడిని చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్న బిడెన్‌ శిబిరం ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున బిజీబిజీగా ప్రచారంలో గడుపుతున్నారు.

బిడెన్‌, కమల ప్రయాణాలతో ముప్పు..

బిడెన్‌, కమల ప్రయాణాలతో ముప్పు..

మరోవైపు తాజాగా డెమోక్రాట్ల శిబిరంలో కరోనా బారిన పడిన ముగ్గురిలో ఒకరు కమలా హ్యారిస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌ అలెన్‌, ఆమె విమాన సిబ్బందిలో మరొకరు ఉన్నారు. మూడో వ్యక్తి బిడెన్‌ విమాన ప్రయాణాల్లో విమానయాన సంస్ధ ఉద్యోగి అని చెబుతున్నారు. కమల తనతో పాటు తిరిగిన ఇద్దరికి కరోనా సోకిందని తెలిసినా బిడెన్‌తో కలిసి ప్రయాణాలు సాగించారు. దీంతో ఇప్పుడు బిడెన్‌ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్ధితి నెలకొంది. అయితే షెడ్యూల్‌లో మాత్రం మార్పులేవీ చేయొద్దని బిడెన్‌ తన టీమ్‌ను కోరినట్లు తెలుస్తోంది.

  Donald Trump's Telangana Fan Bussa Krishna Lost Life ట్రంప్‌ మీద పిచ్చి ప్రేమతో అభిమాని మృతి
  కమల కోలుకోవాలని ట్రంప్‌ ఆకాంక్ష...

  కమల కోలుకోవాలని ట్రంప్‌ ఆకాంక్ష...

  డెమోక్రాట్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌ను ముందు నుంచీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి ట్రంప్‌.. ఆమె శిబిరంలో కరోనా సోకిందని తెలియగానే స్పందించారు. ఆమె గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నట్లు నార్త్‌ కరోలినాలో జరిగిన ప్రచార సభలో చెప్పారు. మాస్కులు, మాస్కులంటూ తెగ విమర్శలు చేశారని, ఇప్పుడు ఆమెను కాపాడలేకపోయాయన్న అర్ధం వచ్చేలా ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తగిన వైద్య సహాయం అవసరమని ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాస్కులు లేకుండా ట్రంప్‌ తిరగడాన్ని కమలతో పాటు బిడెన్‌ కూడా పలుమార్లు తప్పుబట్టారు.

  English summary
  At least three people connected to Joe Biden’s presidential campaign have tested positive for the coronavirus, leading the campaign to suspend in-person events for vice-presidential nominee Kamala Harris through Monday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X