వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్.. ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడాయన. ప్రమాణ స్వీకార కార్యక్రమం క్షణాలు సమీపిస్తోన్న కొద్దీ వాషింగ్టన్‌లో సందడి నెలకొంటోంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డొనాల్డ్ ట్రంప్.. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను వీడారు. భార్య మెలానియాతో కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లారు.

ఫ్లోరిడా పామ్ బీచ్ సమీపంలోని మార్-ఎ-లాగోలో ఆయన నివసించనున్నారు. ఇక ఆయన కేరాఫ్ అడ్రస్ అదే కాబోతోంది. డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌ను వీడిన వెంటనే జో బిడెన్ ఓ ట్వీట్ చేశారు. ఫ్లోరిడా దిశగా ఎయిర్‌ఫోర్స్ వన్ టేకాఫ్ తీసుకున్న వెంటనే జో బిడెన్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాలో నేడు కొత్త రోజు అంటూ ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌ను ఖాళీ చేసి, వాషింగ్టన్‌కు గుడ్‌బై చెప్పిన వెంటనే ఈ ట్వీట్ చేశారు.

Biden inauguration: It’s a new day in America, tweets US President-elect Joe before the inauguration

ప్రమాణ స్వీకారానికి ముందు జో బిడెన్ చేసిన చివరి ట్వీట్ కూడా ఇదే అని భావిస్తున్నారు. ఈ ట్వీట్ అనంతరం.. ఆయన ప్రమాణ స్వీకారానికి బయలుదేరి వెళ్తారని బిడెన్ క్యాంప్ వెల్లడించింది. వైట్‌హౌస్‌ను వీడే సమయంలో డొనాల్డ్ ట్రంప్.. పాత సంప్రదాయాన్ని అనుసరించారు. కొత్త అధ్యక్షుడి కోసం మాజీ అధినేత.. ఓ నోట్‌ను వదిలి వేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని డొనాల్డ్ ట్రంప్ కొనసాగించారు. జో బిడెన్ కోసం.. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి వద్ద ఓ నోట్‌ను వదిలి వెళ్లారాయన.

రొనాల్డ్ రీగన్ హయాం నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన వారసుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కోసం ఓ నోట్‌ను వదిలి వెళ్లారు. అంతకుముందు- 2009లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఒబామా కోసం ఓ నోట్ ఇచ్చారు. తాజాగా ట్రంప్ కూడా.. జో బిడెన్ కోసం నోట్ వదిలివెళ్లినట్లు అమెరికా మీడియా తెలిపింది. అందులో ఎలాంటి సందేశం ఉందనేది తెలియరాలేదని పేర్కొంది. సాధారణంగా.. కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపే సందేశంగా భావిస్తుంటారని అంచనా వేసింది.

కాస్సేపట్లో అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించబోతోన్న జో బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఇక అమెరికాలో జో బిడెన్ హవా ప్రారంభమైందనే సందేశాన్ని ఇచ్చారాయన. తన స్నేహితుడు జో బిడెన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ట్వీట్ చేసిన ఆయన.. ఇక జో బిడెన్ సమయం వచ్చిందని పేర్కొన్నారు. దిసీజ్ యువర్ టైమ్.. అంటూ కామెంట్ చేశారు.

అనుకున్నది సాధించిన ట్రంప్: వైట్‌హౌస్ నుంచి ఎక్కడికెళ్లారంటే: ఇక ఆయన నివాసం అక్కడేఅనుకున్నది సాధించిన ట్రంప్: వైట్‌హౌస్ నుంచి ఎక్కడికెళ్లారంటే: ఇక ఆయన నివాసం అక్కడే

English summary
Moments after Donald Trump departed Washington, Joe Biden’s Twitter account shared this message: “It’s a new day in America.”That may foreshadow the themes of Biden’s inaugural speech. The president-elect based his campaign on the promise to restore the soul of the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X