వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుకున్నది సాధించిన ట్రంప్: వైట్‌హౌస్ నుంచి ఎక్కడికెళ్లారంటే: ఇక ఆయన నివాసం అక్కడే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఇంకాస్సేపట్లో మాజీ కాబోతోన్నారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయగానే.. ట్రంప్ మాజీ అవుతారు. ఒకవంక జో బిడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవ క్షణాలు సమీపిస్తోండగా.. మరోవంక డొనాల్డ్ ట్రంప్.. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను ఖాళీ చేశారు. భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్‌, కుమారుడు, అల్లుడి సమక్షంలో వైట్‌హౌస్‌కు వీడ్కోలు పలికారు. వైట్‌హౌస్‌ను వీడే సమయంలో లభించే వీడ్కోలు లాంఛనాలన్నీ ట్రంప్‌కు అందాయి.

ట్రంప్ చివరి ప్రసంగం: బిడెన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా: వాషింగ్టన్‌కు గుడ్‌బైట్రంప్ చివరి ప్రసంగం: బిడెన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా: వాషింగ్టన్‌కు గుడ్‌బై

 రెడ్ కార్పెట్.. గన్ సెల్యూట్..

రెడ్ కార్పెట్.. గన్ సెల్యూట్..

అమెరికా కాలమానం ప్రకారం. .మధ్యాహ్నం ఒకటిన్నరకు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమం ఆరంభమైంది. రెడ్ కార్పెట్, 21 గన్ సెల్యూట్‌తో వీడ్కోలు పలికారు. వైట్‌హౌస్ నుంచి మెలానియా ట్రంప్‌తో కలిసి రెడ్ కార్పెట్ మీద ట్రంప్ నడచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో వైట్‌హౌస్ ఆవరణలో ఇవాంక ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నెర్, వారి పిల్లలు, కుమారుడు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ ఉన్నారు. వారంతా చప్పట్లు కొడుతూ ట్రంప్-మెలినియాలను స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం 35 నిమిషాల పాటు సాగింది. ఉద్వాసనకు గురై ఉంటే.. ఆయనకు ఈ లాంఛనాలు అందేవి కావని తెలుస్తోంది.

 అన్నీ వదిలేసి వెళ్తోన్నా..

అన్నీ వదిలేసి వెళ్తోన్నా..

వైట్‌హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత.. ఆయన వైట్‌హౌస్ సిబ్బందితో మాట్లాడారు. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నానంటూ భావోద్వేగంతో చెప్పారు. నాలుగేళ్ల పాటు తనను కంటికి రెప్పలా కాపాడుకున్నారని ప్రశంసించారు. వైట్‌హౌస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలనుు తాను విస్మరించబోనని అన్నారు. అధ్యక్షుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారంతా.. థాంక్యూ ట్రంప్.. అంటూ నినదించారు. అమెరికన్ జాతీయ పతాకాలను వారు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ట్రంప్‌కు వీడ్కోలు పలికారు.

ప్రథమ మహిళగా..

కరోనా వైరస్‌ బారిన పడి నాలుగు లక్షలమందికి పైగా మరణించారని, వైరస్‌తో ప్రపంచమంతా కుదేలైందని పేర్కొన్నారు. తన హయాంలో స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పేరుతో అమెరికాను అగ్రరాజ్యంగా నిలిపానని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థికశక్తిగా అమెరికా నిలిచిందని, తన నాలుగేళ్ల హయాం అమెరికా చరిత్రలో నిలిచిపోతుందని ట్రంప్ ఉద్విగ్నంగా చెప్పారు. రికార్డు సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశామని చెప్పారు. అమెరికన్లకు తాను అధ్యక్షుడిగా సేవలు అందించడాన్ని ఆస్వాదించానని వ్యాఖ్యానించారు. అనంతరం కొద్దిసేపు మెలానియా ట్రంప్ మాట్లాడారు. ప్రథమ మహిళగా అమెరికన్లకు సేవ చేసినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

వైట్‌హౌస్ నుంచి ఫ్లోరిడాకు..

వైట్‌హౌస్ నుంచి ఫ్లోరిడాకు..

అనంతరం ఆయన ప్రత్యేక మెరైన్ వన్ ్గ్రీన్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో మై వే అనే గీతాన్ని డిఫెన్స్ మ్యూజిక్ ట్రూప్ ఆలపించారు. విమానం టేకాఫ్ తీసుకునేంత వరకూ గీతాన్ని ఆలపిస్తూ కనిపించారు. అమెరికా జాతీయ పతకాన్ని రెపరెపలాడిస్తూ వారు ట్రంప్ దంపతులకు వీడ్కోలు పలికారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోకు ఆయన వెళ్లారు. మార్-ఎ-లాగోలోనే ఆయన శాశ్వతంగా నివాసం ఉండబోతోన్నారు.

English summary
https://telugu.oneindia.com/news/international/biden-s-inauguration-in-farewell-address-donald-trump-celebrates-legacy-and-extends-wishes-285810.html
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X