వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్‌ బలహీనమేైన అధ్యక్షుడు- మనపై దాడి చేయొచ్చు- చైనా ప్రభుత్వ సలహాదారు కామెంట్స్‌

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్‌ అధికారం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బైడెన్‌ బాధ్యతలు చేపట్టాక తమ దేశంతో ఎలాంటి సంబంధాలు నెరపబోతున్నారనే అంశంపై పలు దేశాల్లో భిన్నవాదనలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో చైనా విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన బైడెన్‌ ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

Recommended Video

US Election 2020:అధికార బదిలీ చేయాల్సివస్తే... చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేస్తున్నాం!-White House

ట్రంప్‌తో పోలిస్తే చైనా విషయంలో మెతగ్గా ఉంటారని భావిస్తున్న బైడెన్‌ బాధ్యతలు చేపట్టాక ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై తాజాగా చైనా ప్రభుత్వ సలహాదారు చేసిన కామెంట్స్ ఆసక్తి చేపుతున్నాయి. బైడెన్‌ బాధ్యతలు చేపట్టాక చైనాతో సంబందాలు మెరుగుపడతాయన్న భ్రమల్లో ఉండొద్దంటూ అడ్వాన్సెడ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ గ్లోబల్‌ అండ్‌ కాంటెంపరరీ చైనా స్టడీస్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు ఝెంగ్‌ యాంగ్‌నియాన్‌ వ్యాఖ్యానించారు. చైనా ప్రభుత్వం యూఎస్‌తో సంబంధాలు తెంచుకోవడమే మంచిదని యాంగ్‌నియాన్‌ పేర్కొన్నట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది.

Biden is a very weak President, could start wars : china govt advisor

అమెరికాతో సత్సంబంధాలు గడిచిన ఆ పాత రోజులు పోయాయని, కొన్నేళ్లుగా బలోపేతం అవుతున్న అమెరికాతో కోల్డ్‌ వార్‌ తప్పదని ప్రభుత్వ సలహాదారు తాజాగా చైనాను హెచ్చరించారు. జో బైడెన్‌ బలహీనమైన అధ్యక్షుడని, ఆయన హయాంలో చైనాతో సాధారణ సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నించే అవకాశాల్లేవని, అవసరమైతే యుద్ధానికే సిద్దపడతారని ఆయన తెలిపారు. ట్రంప్‌ హయాంలో అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలు బైడెన్‌ హయాంలో మరింత దెబ్బతినే అవకాశమందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
china must drop its illusion that its relations with the united states will automatically improve under president elect joe biden's administration, a chinese govt advisor has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X