వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిపోతే ట్రంప్ దేనికైనా సిద్ధం- అప్పుడిక రంగంలోకి సైన్యం- జో బిడెన్ షాకింగ్ కామెంట్స్....

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన పోటీదారులైన రిపబ్లికన్, డెమెక్రాట్ల మధ్య వార్ ముదురుతోంది. తాజాగా డెమోక్రాట్ అభ్యర్ధిగా ఎన్నికైన జో బిడెన్ అలా వచ్చీ రాగానే అధ్యక్షుడు ట్రంప్ పై గురిపెట్టారు. ట్రంప్ ఓటమిపాలైతే సైన్యం రంగంలోకి దిగుతుందంటూ బాంబు పేల్చారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరగబోతోందో బిడెన్ జోక్యం చెప్పేశారు.

జో బిడెన్ గ్రాండ్ ఎంట్రీ....

జో బిడెన్ గ్రాండ్ ఎంట్రీ....


అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే డెమోక్రాట్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన జో బిడెన్ వచ్చీరాగానే హంగామా మొదలు పెట్టేశారు. డెమోక్రాట్ల తరఫున తనకు పోటీగా ఉన్న జెర్సీ శాండర్స్ బరిలో నుంచి తప్పుకోవడంతో బిడెన్ కు ట్రంప్ తో పోటీ పడే అవకాశం దక్కింది. దీంతో వచ్చీ రాగానే ఆయన నేరుగా ట్రంప్ పైకి విమర్శలు ఎక్కుపెట్టారు. అంతటితో ఆగకుండా నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరగబోతోందో కూడా జోస్యం చెప్పేశారు. దీంతో బిడెన్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

 ట్రంప్ ఓడిపోతే ఏం జరుగుతుందో ?

ట్రంప్ ఓడిపోతే ఏం జరుగుతుందో ?


నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ ఓడిపోతే ఏం జరగబోతోందో బిడెన్ అంచనా వేశారు. కామెడీ సెంట్రల్ ది మెయిల్ షోలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో విజయం కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన ఏం చేయబోతున్నారో తెలియదన్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా ఓటు వేయడాన్ని ట్రంప్ తీవ్రంగా్ వ్యతిరేకిస్తున్నారని బిడెన్ చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసే రిపబ్లికన్ల ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్ద డెమోక్రాటిక్ పార్టీ తరఫున లాయర్లను నియమించే అవకాశం ఉందని బిడెన్ చెప్పారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైతే ఓటమిని అంగీకరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశముందని బిడెన్ అంచనా వేశారు. అదే జరిగితే సైన్యం రంగంలోకి దిగి ఆయన్ను ఇంటికి సాగనంపుతుందన్నారు.

Recommended Video

Donald Trump Considering సస్పెండింగ్ H1B Visas
గతంలో ట్రంప్ ఇలాగే....

గతంలో ట్రంప్ ఇలాగే....


గతంలో హిల్లరీ క్లింటన్ తో పోటీ పడుతున్నప్పుడు ట్రంప్ ఇలాగే వ్యవహరించారు. 2016 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫైనల్ డిబేట్ లో మాట్లాడుతూ ఒకవేళ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే తాను దాన్ని అంగీకరించబోనని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ బిడెన్ తాజా కామెంట్లు చేశారు. తన విషయంలోనూ అదే జరుగుతుందేమో అని బిడెన్ తన ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ భావిస్తున్నట్లు జరిగితే సైన్యం రంగంలోకి దిగుతుందని చెప్పడం ద్వారా ట్రంప్ కు బిడెన్ గట్టి హెచ్చరికలే పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Democrat Candiate For US elections Joe Biden has predicted the military will escort Donald Trump from the White House should the president lose November’s election but refuse to leave office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X