వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు ఎదురుదెబ్బ, కుల్ భూషన్ ను ఇరాన్ లో పట్టుకొన్నాం:ఐఎస్ఐ మాజీ అధికారి

పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత మాజీ నావికాదశ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను తమ దేశంలోనే అరెస్టు చేశామని పాకిస్థాన్ చెబుతున్న మాటలు అబద్దమని తేలిపోయింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత మాజీ నావికాదశ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను తమ దేశంలోనే అరెస్టు చేశామని పాకిస్థాన్ చెబుతున్న మాటలు అబద్దమని తేలిపోయింది.

జాదవ్ ను ఇరాన్ లో పట్టుకొన్నామని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ అధికారి, రిటైర్ట్ లెఫ్టినెంట్ జనరల్ అంజాద్ షోయబ్ వెల్లడించారు. జాదవ్ ను తమ దేశంలో అరెస్ట్ చేయలేదన్నారు.

Big blow for Pakistan: Ex-ISI official admits Kulbhushan Jadhav was captured from Iran

అతడిని బలూచిస్తాన్ లో అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ చెబుతోంది. ఇరాన్ నుండి తమ దేశంలోకి చొరబడుతుండగా గత ఏడాది మార్చి 3న, అరెస్టు చేసినట్టు పేర్కొంది.

ఐఎస్ఐ మాజీ అధికారి ప్రకటనతో దాయాది దేశానికి దిమ్మతిరిగింది. నావికా దళం నుండి పదవీ విరమణ చేసిన ఇరాన్ లో వ్యాపారం చేసుకొంటున్న జాదవ్ ను కిడ్నాప్ చేసి అతడిపై పాక్ పై గూఢచర్యం ఆరోపణలు మోపిందని భారత్ చెబుతోంది.

మరో వైపు జాదవ్ కేసుపై త్వరగా విచారణ చేపట్టాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాకిస్తాన్ అభ్యర్థించింది. జాదవ్ కు పాక్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది.

తుదితీర్పు వచ్చేవరకు శిక్ష అమలు చేయవద్దని పాకిస్తాన్ కు ఐసీజే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో త్వరగా విచారణ చేపట్టాలని పాక్ కోరుతోంది.

English summary
Puncturing Pakistan's claim that it arrested Kulbhushan Jadhav on its own soil, Amjad shoaid, an ex ISI official and a retired lieutenant general has admitted that the ex Indina Navy officer was captured in Iran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X