వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ ఒప్పందాలపై ట్రంప్ మెలిక: అమెరికా అధ్యక్షుడి పర్యటనలో భారీ అగ్రీమెంట్స్ లేనట్టే..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఈ నెల 24, 25వ తేదీల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా భారత్-అమెరికాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్న నేపథ్యంలో ట్రంప్ బాంబు పేల్చారు. కొన్ని భారీ ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఆ ఒప్పందాలను మరికొంత కాలం తర్వాత కుదుర్చుకుంటామని ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ చెప్పారు. అంటే ట్రంప్ పర్యటన సందర్భంగా ఎలాంటి భారీ ఒప్పందాలు ఉండబోవని స్పష్టమవుతోంది.

భారీ ఒప్పందాలు ఇప్పుడు లేనట్టే..

భారీ ఒప్పందాలు ఇప్పుడు లేనట్టే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన సందర్భంగా భారీగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చేలా లేదు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ తర్వాతే భారత్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకుందామనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు సమాచారం. భారత్‌తో కచ్చితంగా భారీ వాణిజ్య ఒప్పందం జరుగుతుందని అయితే ఇది భారత పర్యటన సందర్భంగా జరుగుతుందా లేక ఎన్నికల తర్వాత జరుగుతుందా అనేది ఇప్పుడే చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

 అమెరికా పట్ల భారత్ ఉదాసీనతతో వ్యవహరిస్తోంది

అమెరికా పట్ల భారత్ ఉదాసీనతతో వ్యవహరిస్తోంది

ఇదిలా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అమెరికా వాణిజ్యశాఖ ప్రతినిధి రాబర్ట్ లైట్జర్.. ట్రంప్‌తో పాటు భారత్‌కు వస్తున్న బృందంలో ఆయన లేరు. దీంతో ఒప్పందాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తను భారత్‌కు వస్తున్నారా లేదా అనేదానిపై మాత్రం కచ్చితమైన సమాచారం లేదు. ఇదిలా ఉంటే భారత్ అమెరికాపట్ల ఉదాసీనతతో వ్యవహరిస్తోందని ట్రంప్ కామెంట్ చేశారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు డొనాల్డ్ ట్రంప్.

 ఘనస్వాగతం పలికేందుకు భారత్ సిద్ధంగా ఉంది

ఘనస్వాగతం పలికేందుకు భారత్ సిద్ధంగా ఉంది


విమానశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు ఏడు మిలియన్ మంది ప్రజలు తనకు స్వాగతం పలుకుతారని ప్రధాని తనతో చెప్పినట్లు ట్రంప్ చెప్పారు. అంతేకాదు కార్యక్రమం జరగబోయే మొతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అని తనకు ప్రధాని మోడీ వివరించినట్లు చెప్పారు. కచ్చితంగా తను భారత పర్యటనను ఆస్వాదిస్తానని చెప్పారు. వస్తువులు సేవల రంగంలో అమెరికాకు భారత్ అతిపెద్ద భాగస్వామి. చైనా తర్వాత ఆ స్థానం భారత్‌కే దక్కుతుంది. అమెరికా భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పరంగా చూస్తే వస్తువులు 62శాతం ఉంటే సేవలు 38శాతం ఉన్నాయి. అదే భారత్ చైనాల మధ్య వాణిజ్య పరమైన సంబంధాలు చూస్తే వస్తువుల్లో చైనా అమెరికా కంటే ముందుంది.

English summary
US President Donald Trump has said he is "saving the big deal" with India for later and he "does not know" if it will be done before the presidential election in November, clearly indicating that a major bilateral trade deal during his visit to Delhi next week might not be on the cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X