వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటిపై సిటీ: ఈఫిల్ టవర్‌కన్నా ఎత్తైన భారీ నౌక(ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్: ప్రపంచంలోనే అతి ఎత్తైన, పెద్దదైన క్రూయిజ్ షిప్ సిద్ధమైంది. ఇందులో 5,500 ప్రయాణీకులు పడతారు. దీని బరువు లక్షా ఇరవై వేల టన్నుల బరువు. 66 మీటర్ల వెడల్పు, 362 మీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. ఈ నౌక నీటి పైన వెళ్తుంటే నీటిపై నగరం తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది.

ఈ నౌక ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఉంది. ఈఫిల్ టవర్ 300 మీటర్లు ఉంటే, దీని ఎత్తు 362 మీటర్లు. నౌకలోని 16 డెక్సులలో ప్రయాణీకులకు వేలాది గదులు, సౌకర్యాలు ఉంటాయి. ఈ నౌక పేరు హార్మోనీ ఆప్ ది సీస్. ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక.

ఫ్రాన్స్‌లోని సెయింట్‌ నజైర్‌ షిప్‌యార్డ్‌ నుంచి నిర్మాణం అనంతరం తొలిసారి ఈ నౌక ప్రయాణం ప్రారంభించింది. పోర్టు నుంచి బయలుదేరుతున్న నౌకను చూడడానికి తీరానికి చాలామంది ప్రజలు తరలి వచ్చారు. చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

నౌకను అమెరికాకు చెందిన రాయల్‌ కరేబియన్‌ క్రూయీజ్‌ లిమిటెడ్‌(ఆర్‌సీసీఎల్) మూడేళ్లపాటు శ్రమించి నిర్మించింది. దీని ఖర్చు సుమారు బిలియన్ యూరోలు. ఈ నౌక సెయింట్‌ నజైర్‌ నుంచి సదరన్‌ ఇంగ్లండ్‌లోని సౌంతప్టన్‌కు వెళ్తొంది. అక్కడి నుంచి మే 22న బార్సిలోనాకు వెళ్లనుంది.

English summary
Harmony of the Seas is set to arrive in southern England on Tuesday ahead of its inaugural voyage on 22 May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X