వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్లుగా నాపై రేప్ చేస్తున్నారు: యోగా గురువుపై కెనడా మహిళ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

కెనడా: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ యోగా గురువుగా పేరు సంపాదించిన విక్రమ్ చౌదురి(69) చిక్కుల్లో పడ్డారు. విక్రమ్ చౌదరి కెనడాలోని వాంకోవర్ కేంద్రంగా యోగాలో వేలాది మందికి శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా, గత మూడేళ్లుగా విక్రమ్ తనను లైంగిక వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని వాంకోవర్‌కు చెందిన ఓ మహిళ కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానంలో కేసు వేసింది.

సదరు మహిళ తరపు న్యాయవాది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. తన క్లైంటు 18 సంవత్సరాల వయసులో తొలిసారిగా విక్రమ్ వద్దకు యోగాలో శిక్షణ కోసం 2010లో వెళ్లిందని తెలిపారు. విక్రమ్ ఆమెను లైంగికంగా వేధించాడని, తనతోపాటు హోటల్ గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించాడు.

Bikram Choudhury, Yoga Guru, Sued By Vancouver Woman For Alleged Rape

ఆ తర్వాత శిక్షకురాలిగా ఆయన వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పారు. ఆయనకు నగరంలో ప్రముఖులతో పరిచయాలు ఉండటంతో తన క్లయింటు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారని తెలిపారు.

అంతేగాక, ‘నా మాట వినని ప్రజలు చనిపోతారు' అని విక్రమ్ చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని న్యాయవాది తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఈ ఆరోపణలను విక్రమ్ తరపు న్యాయవాది కొట్టిపారేశారు. విక్రమ్‌పై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని చెప్పారు. కాగా, విక్రమ్‌పై ఇప్పటికే ఐదుగురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

English summary
A Vancouver woman has become the sixth person to file a lawsuit alleging sexual assault against Bikram Choudhury, the millionaire founder of a popular style of hot yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X