వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు చేదువార్త: ఇండియాలో 2 లక్షల ఉద్యోగాల్లో కోత, అమెరికాకు ఉద్యోగాలు

కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడ ట్రంప్ కన్ను పడింది. తక్కువ విద్యార్హతతోనే ఎక్కువ ఉద్యోగాలు దక్కించుకొనేందుకుగాను ట్రంప్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం కారణంగా కాల్ సెంటర్ ఉద్యోగాలు కూడ పో

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:స్థానికులకే ఉద్యోగావకాశాల పేరుతో అమెరికా అధ్యక్షుడు తీసుకొంటున్న నిర్ణయాలు ఇతర దేశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం కన్పిస్తోంది. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోకుండా ట్రంప్ నిర్ణయాలను తీసుకొంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ఈ ప్రకటనకు అనుగుణంగా ట్రంప్ నిర్ణయాలను తీసుకొంటున్నారు.

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా ట్రంప్ చట్టాలను తీసుకొస్తున్నారు. విదేశాల్లో సెంటర్లు పెడితే ప్రభుత్వం నుండి ఇచ్చే రాయితీలను ఎత్తివేస్తామని అమెరికా కొత్త చట్టాలను తెచ్చింది.

అమెరికాలోని సంస్థలు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను తీసుకోవడం లేదా, వారికి పనిని అప్పగించడం వంటి చర్యలు తీసుకొంటే అమెరికా ప్రభుత్వం నుండి రాయితీలను కట్ చేసే అవకాశం లేకపోలేదు.

కాల్ సెంటర్లపై ట్రంప్ కన్ను

కాల్ సెంటర్లపై ట్రంప్ కన్ను


అమెరికాలోని స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా అడ్డుగా ఎవరున్నారనే విషయాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఈ దిశగా చర్యలను చేపడుతోంది. చట్టాలను కఠినతరం చేయడం వల్ల స్థానికులకే ఉద్యోగాలను ఎక్కువ శాతం ఇచ్చేలా కంపెనీలకు అనివార్యపరిస్థితులను కల్పించనుంది.

తక్కువ విద్యార్హతతో ఎక్కువ సంఖ్యలో అమెరికా యువతకు ఉద్యోగాలు కాల్ సెంటర్లు కల్పించనున్నాయి.కాల్ సెంటర్ ఉద్యోగాలు అమెరికా నుండి తరలివెళ్ళకుండా ఉండేందుకుగాను కఠిన చర్యలు తీసుకొంటూ బిల్లును తెచ్చింది అమెరికా.

కాల్ సెంటర్లలో 2 లక్షల ఉద్యోగాల్లో కోత?

కాల్ సెంటర్లలో 2 లక్షల ఉద్యోగాల్లో కోత?

భారత్ లో 3.3 లక్షల ఉద్యోగాలను కాల్ సెంటర్ రంగం కల్పిస్తోంది. వీటిలో మూడింట రెండొంతుల ఉద్యోగాలు అమెరికా వినియోగదారులకు సేవలందిస్తున్న కాల్ సెంటర్లు కల్పిస్తున్నవే.


రానున్న రోజుల్లో భారత్ లో కనీసం రెండు లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.2015 లో భారత్ ఐటీ ఎగుమతులు వంద బిలియన్ డాలర్లు, వీటిలో అమెరికా వాటా 60 శాతం.భారత్ కు వచ్చే ఐటి ఆదాయంలో బీపిఓల వాటా 5.11 శాతం .బిపిఓల ద్వారా ప్రతి ఏటా మూడు బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం వస్తోంది.

ఇంగ్లీష్ పై పట్టుతో బిపిఓ ఉద్యోగాలు

ఇంగ్లీష్ పై పట్టుతో బిపిఓ ఉద్యోగాలు

1990 నుండి 2010 వరకు భారత్ లో కాల్ సెంటర్ల బూమ్ నడిచింది. ఖర్చులు తగ్గించుకొనేందుకుగాను పాశ్చాత్య దేశాల్లోని కంపెనీలు వినియోగదారులకు సేవలందించే కాల్ సెంటర్లను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వడం ద్వారా లాభాలను ఆర్జించే పద్దతిని ప్రారంభించాయి.


మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు కాల్ సెంటర్లు తమ కార్యకలాపాలను విస్తరించాయి.ఇంగ్లీష్ పై పట్టు ఉండడం రూ.15 వేల నుండి రూ.20 వేలకే ఉద్యోగాలు లభించడం ద్వారా ఇండియాలో ఎక్కువగా బిపిఓ ఉద్యోగాలు లభించాయి.ఇంగ్లీష్ పై పట్టు కారణంగా ఈ ఉద్యోగాలు లభించాయి.

ఫిలిఫ్పిన్స్ లో బిపిఓ ఉద్యోగాలు

ఫిలిఫ్పిన్స్ లో బిపిఓ ఉద్యోగాలు

భారత్ లోని బిపిఓ సేవలను పాశ్చాత్య కంపెనీలు ఫిలిఫ్ఫిన్స్ కు తరలించాయి. ఫిలిఫ్పిన్స్ వాసుల ఇంగ్లీష్ యాస అమెరికన్లకు దగ్గరగా ఉంటుంది.


దీంతో ఎక్కువ కంపెనీలు భారత్ కంటే ఫిలిఫ్పిన్స్ కు ప్రాధాన్యత ఇచ్చాయి.2010 నుండి భారత్ కంటే ఫిలిఫ్పిన్స్ నే ఎక్కువ కంపెనీలు ప్రాధాన్యత ఇచ్చాయి.ఇండియాకు చెందినన ఐటి దిగ్గజ కంపెనీలు కూడ తమ బిపిఓ సెంటర్లను ఫిలిప్పిన్స్ కు తరలించాయి.

బిపిఓ కంపెనీలు అమెరికాలోనే ఉండేలా చట్టం

బిపిఓ కంపెనీలు అమెరికాలోనే ఉండేలా చట్టం


కాల్ సెంటర్ కంపెనీలు భారత్, ఫిలిఫ్పిన్స్ లాంటి దేశాల్లో తమ సెంటర్లను నిర్వహించకుండా అమెరికాలోనే సెంటర్లను నిర్వహించేలా అమెరికా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. యూఎస్ కాస్ సెంంటర్ ,కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు.ఇతర దేశాల్లో కంపెనీలను నిర్వహించినవారికి అమెరికా నుండి ఎలాంటి గ్రాంట్లు ఉండవు. కాల్ చేసే వినియోగదారులకు తాము ఎక్కడి నుండి మాట్లాడుతున్నామో కంపెనీ ప్రతినిధి ముందుగా చెప్పాల్సి ఉంటుంది.


ఇతర దేశాల్లో కాల్ సెంటర్లను నిర్వహించుకొనే వారు ఖర్చును తట్టుకోలేక అమెరికాకు తరలించే కార్యక్రమాలను నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటాయి.విదేశాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తే దేశ ప్రయోజనాలను పట్టించుకోని కంపెనీగా అధికారిక ముద్ర పడుతోంది.

English summary
A bipartisan Bill was on Friday reintroduced in the US Congress to make companies that move call centres overseas ineligible for grants or guaranteed loans from the government, a move aimed at curbing the transfer of jobs to countries like India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X