వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిస్తే ఔటే! అమెరికన్ కాంగ్రెస్‌లో మరోసారి బిల్లు!

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిచ్చే కంపెనీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో మరోసారి ప్రవేశపెట్టారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిచ్చే కంపెనీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో మరోసారి ప్రవేశపెట్టారు. భారత్ వంటి దేశాలకు ఉద్యోగాల బదిలీ కొనసాగకుండా చూడటమే ఈ ద్వైపాక్షిక బిల్లు ముఖ్య ఉద్దేశం.

అధికార రిపబ్లికన్ సభ్యుడు డేవిడ్ మెకిన్లే, ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యుడు జీన్ గ్రీన్ ప్రతిపాదనల ప్రకారం అమెరికా వెలుపల కాల్ సెంటర్లు నిర్వహించుకునే కంపెనీలకు గ్రాంట్లు లభించవు. ప్రభుత్వం నుంచి రుణాలు కూడా అందవు.

ఈ బిల్లు ప్రకారం ఉద్యోగాలను తరలించే సంస్థలను బ్యాడ్ యాక్టర్స్ జాబితాలో చేరుస్తారు. విదేశీ కాల్ సెంటర్లు తాము ఎక్కడినుంచి మాట్లాడుతున్నామో వినియోగదారులకు వెల్లడించాల్సి ఉంటుంది. అమెరికా వినియోగదారులు కోరినప్పుడు వారికి అమెరికాలోనే ఉండే సర్వీస్ ఏజెంట్ నుంచి సేవలను అందించాల్సి ఉంటుంది.

Bill against outsourcing jobs reintroduced in US Congress

2013లో కూడా ఇదే తరహా బిల్లును ప్రవేశపెట్టారు. ఒక్క గ్రేగ్ హూస్టన్ ప్రాంతంలోనే 54 వేల కాల్ సెంటర్ ఉద్యోగాలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని గ్రీన్ పేర్కన్నారు.

దురదృష్టవశాత్తు కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇక్కడి నుంచి భారత్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు తరలిపోతున్నాయని, ఈ ద్వైపాక్షిక బిల్లు ద్వారా అమెరికన్లకు ఉద్యోగ భద్రత ఉండడంతోపాటు ఇక్కడి వినియోగదారులు అనుచితమైన ప్రవర్తను నుంచి ఉపశమనం పొందుతారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు అమెరికా ఎన్నికల సందర్భంగా రష్యన్లతో నెరిపిన సంబంధాలపై చేపట్టే దర్యాప్తులో తాను జోక్యం చేసుకోనని, ఆ కేసుల నుంచి తాను తప్పుకుంటున్నానని అమెరికా అటర్నీ జనరల్ జెఫ్ షెషన్స్ ప్రకటించారు.

English summary
WASHINGTON; A bipartisan Bill was today reintroduced in the US Congress to make companies that move call centres overseas ineligible for grants or guaranteed loans from the government, a move aimed at curbing the transfer of jobs to nations like India. Introduced by Congressmen Gene Green from the Democratic Party Green and Republican David McKinley, the US Call Center and Consumer Protection Act would deter companies from shipping American jobs overseas and incentivise them to locate in the US by creating a public list of "bad actors" consisting of those that shipped all or most of their service work overseas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X