• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bill Gates: అమెరికాలోనే పెద్ద రైతు -2.7లక్షల ఎకరాల సాగుభూమి -ఆ ఆలుగడ్డలే McDonald's ఫ్రైస్‌గా

|

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడిగా మొదలై, ఆ సంస్థకు సీఈవోగా పాపులరై, ప్రపంచ కుబేరుడిగా తిరుగులేని స్థాయికి ఎదిగి, సంపాదించిన దాంట్లో సగానికిపైగా సమాజానికి ఇచ్చేసిన మహాదాతగా పేరుపొందాడు బిల్ గేట్స్. భార్యతో విడాకుల సందర్భంలో ఆయనలోని చీకటి కోణాలు కొన్ని ఇటీవల వెలుగులోకి రాగా, ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన సంగతి బయటపడింది.

మోదీ అనూహ్యం: కేంద్ర కేబినెట్ విస్తరణ -ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం -అమిత్ షా, నడ్డాతో కసరత్తు, యూపీలోనూమోదీ అనూహ్యం: కేంద్ర కేబినెట్ విస్తరణ -ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం -అమిత్ షా, నడ్డాతో కసరత్తు, యూపీలోనూ

2.69లక్షల ఎకరాలు భూమి

2.69లక్షల ఎకరాలు భూమి

బిల్ గేట్స్ అంటే మనందరికీ తెలిసిన నిర్వచనాలు కాకుండా ఇంకోటి కూడా ఉంది. అయన అమెరికాలోనే అతిపెద్ద రైతు. అఫ్‌కోర్స్, నేరుగా పొలంలోకి దిగి వ్యవసాయం చేసిన సందర్భాలు తక్కువే అయినప్పటికీ, ఆయనకున్నంత సాగుభూమి అమెరికాలో ఇంకెవరికీ లేదంట. బిల్ గేట్స్, అతణ్నుంచి త్వరలోనే విడాకులు పొందనున్న భార్య మెలిండా గేట్స్ లకు అమెరికాలోని 18 రాష్ట్రాల్లో ఏకంగా 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి.

సకల పంటలూ పండిస్తారు

సకల పంటలూ పండిస్తారు

అమెరికాలో ప్రఖ్యాత ‘ల్యాండ్ రిపోర్ట్', ‘ఎన్ బీసీ' రిపోర్టుల ప్రకారం గేట్స్ లూసియానా, నెబ్రాస్కా, జార్జియా ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు. నార్త్ లూసియానాలోనే గేట్స్‌కు 70,000 ఎకరాల భూమి ఉందని, అక్కడ వారు సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు. అలాగే నెబ్రాస్కాలో ఉన్న 20,000 ఎకరాలలో అక్కడ రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇంకా జార్జియాలో ఉన్న 6000 ఎకరాలు, వాషింగ్టన్ లో ఉన్న 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో ఆలుగడ్డలను పండిస్తున్నారు.

గేట్స్ ఆలుగడ్డలే మెక్ డోనాల్డ్స్ ఫ్రైస్

గేట్స్ ఆలుగడ్డలే మెక్ డోనాల్డ్స్ ఫ్రైస్

అమెరికాకే చెందిన ప్రఖ్యాత ఫుడ్ కంపెనీ మెక్ డోనాల్డ్స్ ఎక్కువగా వాడేది బిల్ గేడ్స్ భూముల్లో పండిన ఆలుగడ్డలనే అని రిపోర్టులో పేర్కొన్నారు. "ప్రస్తుత ప్రపంచంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. ఎక్కువ మొత్తంలో పంటలు పండించడం ద్వారా అటవీ నిర్మూలనను నివారించవచ్చు. అలాగే ఆఫ్రికా వంటి దేశాలలో ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను, ఆహార సమస్యను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది" అని వ్యవసాయం గురించి బిల్ గేట్స్ ఓ సందర్భంలో చెప్పారు.

సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనాసజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా

English summary
we all know Bill Gates as the co-founder and CEO of Microsoft Corporation but did you know Gates takes a keen interest in agriculture. This might not sound very believable, but Gates is one of America’s biggest farmers. Bill Gates and his estranged wife Melinda Gates have accumulated more than 269,000 acres of farmland across 18 American states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X