వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bill Gates చీకటి కోణం: మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో సెక్సువల్ రిలేషన్: విడాకుల తరువాత వెలుగులోకి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తోన్న మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత, అపర కుబేరుడు, దాన కర్ణుడిగా గుర్తింపు పొందిన బిల్‌గేట్స్‌‌ జీవితంలో చీకటి కోణాలు ఉన్నాయా? భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించారా? మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి వైదొలగడానికి అదే కారణమైందా? అనే వార్తలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ అధినేతగా కొనసాగుతోన్న సమయంలో ఆయన తోటి ఉద్యోగినితో హాట్ హాట్‌గా రొమాన్స్ చేశారనే వార్తలు గుప్పు మంటోన్నాయి. మెలిండా గేట్స్‌తో విడాకులు తీసుకోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Bill Gates: దాన కర్ణుడికి ఇదేం పోయే కాలం: భార్యకు విడాకులు: 65 ఏళ్ల వయస్సులో ఆస్తిగొడవలాBill Gates: దాన కర్ణుడికి ఇదేం పోయే కాలం: భార్యకు విడాకులు: 65 ఏళ్ల వయస్సులో ఆస్తిగొడవలా

 2020లో బోర్డు నుంచి వైదొలగడానికి కారణం అదే..

2020లో బోర్డు నుంచి వైదొలగడానికి కారణం అదే..

మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ గత ఏడాది మార్చి 13వ తేదీన వైదొలగిన విషయం తెలిసిందే. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి ఆయన తప్పుకొన్నారంటూ మొదట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడది వాస్తవం కాదని తేలింది. తోటి ఉద్యోగినితో రాసలీలు సాగించిన కారణంగానే బోర్డు నుంచి అయిష్టంగానే బిల్‌గేట్స్ తప్పుకొన్నారని తాజాగా స్పష్టమౌతోంది. బోర్డు సభ్యులు నిర్ణయం, వారి ఒత్తిడి మేరకే బిల్‌గేట్స్ వైదొలగాడనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

 2019లో వెలుగులోకి..

2019లో వెలుగులోకి..

మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తోన్న ఓ మహిళా ఇంజినీర్‌తో బిల్‌గేట్స్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారనే విషయం 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ.. సెక్సువల్ రిలేషన్‌ను బిల్‌గేట్స్ కొనసాగించినట్లు తేలింది. బాధితురాలు స్వయంగా బోర్డుకు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళా ఇంజినీర్ రాసిన లేఖపై మైక్రోసాఫ్ట్ బోర్డు.. దర్యాప్తునకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా థర్డ్‌పార్టీ న్యాయ విభాగంతో విచారణ జరిపించింది. అది నిజమేనని తేలింది. విచారణ కొనసాగుతోన్న సమయంలో ఆ మహిళా ఇంజినీర్‌కు బోర్డు సభ్యులు రక్షణ కల్పించినట్లు కూడా స్పష్టమైంది.

20 ఏళ్ల కిందటి రిలేషన్‌షిప్‌గా

20 ఏళ్ల కిందటి రిలేషన్‌షిప్‌గా

ఆ మహిళా ఇంజినీర్‌తో ఉన్న వివాహేతర సంబంధం ఇప్పటిది కాదని బిల్‌గేట్స్ అధికార ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వారిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ 20 ఏళ్ల కిందటిదని నిర్ధారించారని తెలిపింది. బిల్‌గేట్స్ బోర్డు నుంచి తప్పుకోవడానికి, ఈ రిలేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ అధికార ప్రతినిధి వెల్లడించినట్లు స్పష్టం చేసింది. 2000లో బిల్, ఆ మహిళా ఇంజినీర్‌తో కొంతకాలం రిలేషన్‌లో గడిపారని వివరణ ఇచ్చినట్లు తెలిపింది. తాజాగా బిల్‌గేట్స్-మెలిండా గేట్స్ విడాకులు తీసుకోవడానికి ఇది ఓ కారణమై ఉండకపోవచ్చని అంచనా వేసినట్లు పేర్కొంది.

 65 ఏళ్ల వయస్సులో..

65 ఏళ్ల వయస్సులో..

65 సంవత్సరాల మలిదశ వయస్సులో బిల్‌గేట్స్ భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 27 సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నామని వారిద్దరు ఈ నెల 4వ తేదీన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఒకరిపై ఒకరి పట్ల నమ్మకం సడలుతోందని పేర్కొన్నారు. దీనితో తమ వివాహ బంధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించలేమని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకరి నుంచి ఒకరికి ప్రైవసీ కావాలని ఇద్దరం కోరుకుంటున్నామని, అందుకే ఇద్దరి సమ్మతంతో విడాకులు తీసుకోనున్నట్లు వివరించారు. విడాకుల అనంతరం తమ కొత్త జీవితం ఆరంభమౌతుందని, ఇదెలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనీ స్పష్టం చేశారు.

English summary
Board members at Microsoft made a decision in 2020 that it wasn't appropriate for its co-founder Bill Gates to continue sitting on its board as they investigated the billionaire’s prior romantic relationship with a female Microsoft employee that was deemed inappropriate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X