వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత ప్రమాదకరం: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై బిల్ గేట్స్, డబ్ల్యూహెచ్ఓకు మిలిందా భారీ విరాళం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. ఆ నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరం

ప్రపంచం మొత్తం ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ తీసుకుంటున్న చర్యల కారణంగానే కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ ఒక వేళ తన పని ఆపేస్తే.. మరే సంస్థ కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయదని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా డబ్ల్యూహెచ్ఓ అవసరం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఉందని బిల్ గేట్స్ స్పష్టం చేశారు.

చైనాకు పక్షపాతి అంటూ ట్రంప్..

చైనాకు పక్షపాతి అంటూ ట్రంప్..

కరోనావైరస్ ముప్పుపై ప్రపంచాన్ని ముందుగా హెచ్చరించంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని ఆరోపించిన డొనాల్డ్ ట్రంప్.. ఆ సంస్థకు నిధులు నిలిపివేయాలంటూ రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కావాలనే మొదట కప్పిపుచ్చిందని, ఆ విషయంలో చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందంటూ ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్ నిర్ణయం అవివేకం..

ట్రంప్ నిర్ణయం అవివేకం..


ఇది ఇలావుండగా, ప్రపంచ ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ మరోసారి భారీ విరాళం ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓకు సహాయాన్ని అమెరికా ఉపసంహరించుకోవడం అవివేకమని, అంతేగాక ప్రమాదకరమని మిలిందా గేట్స్ అన్నారు.

Recommended Video

Parliament Adjourned : Jagan Govt Mulling Over AP Council Abolition, Budget, Capital Shifting
అమెరికా తర్వాత గేట్స్ ఫౌండేషన్‌ సాయమే పెద్దది..

అమెరికా తర్వాత గేట్స్ ఫౌండేషన్‌ సాయమే పెద్దది..


బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ప్రపంచ ఆరోగ్య సంస్థకు 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఆమె ప్రకటించారు. కాగా, అమెరికా ప్రభుత్వం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ అతిపెద్ద దాత కావడం గమనార్హం. ఇప్పటికే కరోనాపై పోరాటం కోసం 100 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించిన గేట్స్ ఫౌండేషన్.. తాజాగా మరో 150 మిలియన్ డాలర్లు ప్రకటించడంతో మొత్తం 250 మిలియన్ డాలర్లకు వారి విరాళం చేరుకుంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిధుల నిలిపివేత నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Bill Gates slams Trump’s ‘dangerous’ decision to halt WHO funding during coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X