వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ ధనికుల్లో మూడో స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్.. ఇదిగో పూర్తి జాబితా..!

|
Google Oneindia TeluguNews

మైక్రో సాఫ్ట్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఇప్పటివరకు ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడుగా పేరుగడించాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని మరొకరు కైవసం చేసుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్ సూచిక విడుదల చేసిన ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో ఎవరెవరికి ఏ స్థానం దక్కింది.. అందులో భారతీయులు ఏ స్థానంలో ఉన్నారు..?

రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్

రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ ధనికుల జాబితాలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. ఆ స్థానంను బెర్నార్డ్ అర్నాల్ట్ ఎగబాకాడు. తొలిస్థానంను మాత్రం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలుపుకున్నాడు. రెండో స్థానం కైవసం చేసుకున్న అర్నాల్ట్ ఎల్‌వీఎమ్‌హెచ్ మోయెట్ హెన్నెస్సీ- లూయిస్ విటన్ ఎస్ఈ, ఏకేఏ ఎల్‌వీఎమ్‌హెచ్ సంస్థకు ఛైర్మెన్ మరియు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అర్నాల్ట్‌కు సంబంధించిన సంపాదన ఆస్తుల వివరాలు ఎల్‌వీఎమ్‌హెచ్ సబ్మిట్ చేసింది. ఆయన నికర ఆదాయం 108 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఒక్క 2019లోనే అర్నాల్ట్ 39 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఆ సంస్థ పేర్కొంది. బ్లూంబర్గ్ విడుదల చేసిన ప్రపంచంలోని 500ల ధనికుల జాబితాలో ఒక వ్యక్తి ఒక ఏడాది సంపాదనలో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు అర్నాల్ట్.

 తొలిస్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

తొలిస్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

ఇదిలా ఉంటే అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇంకా తొలి స్థానంలో కొనసాగుతున్నట్లు బ్లూంబర్గ్ సంస్థ తెలిపింది. ఆయన ఆస్తుల నికర విలువ 125 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది.ఇక రెండో స్థానం నుంచి బిల్ గేట్స్ మూడో స్థానంకు పడిపోయారు. అతని నికర విలువ 107 బిలియన్ డాలర్లుగా ఉందని బ్లూంబర్గ్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ ముగ్గురు ఆస్తుల విలువ కలిపితే ఎస్‌&పీలో నమోదైన 500 లిస్టెడ్ కంపెనీల ఆస్తుల విలువ కూడా సరితూగడం లేదని పేర్కొంది. ఈ లిస్టెడ్ కంపెనీల్లో వాల్‌మార్ట్, ఎక్సాన్ మోబిల్ కార్ప్, వాల్ట్ డిస్నీలాంటి సంస్థలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బిల్‌గేట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమైనందున రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు 35 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. అలా విరాళంగా ఇచ్చి ఉండకపోతే బిల్‌గేట్స్‌ ఇంకా రెండో స్థానంలో కొనసాగేవారని బ్లూంబర్గ్ పేర్కొంది.

మహిళల్లో నాలుగో స్థానంలో నిలిచిన జెఫ్ బెజోస్ మాజీ భార్య

మహిళల్లో నాలుగో స్థానంలో నిలిచిన జెఫ్ బెజోస్ మాజీ భార్య


భార్యతో విడాకులు తీసుకుని ఆమెకు తన ఆస్తిలో వాటా ఇచ్చాక కూడా జెఫ్ బెజోస్ తొలిస్థానంలో నిలిచారని బ్లూంబర్గ్ సంస్థ పేర్కొంది. దీంతో జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. ఇక ఓవరాల్‌గా ఆమె 22వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్టు మేయర్స్ నిలిచారు. ఇక మనదేశానికి చెందిన ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్ డాలర్లుగా బ్లూంబర్గ్ తెలిపింది. 20.5 బిలియన్ డాలర్లతో అజీమ్ ప్రేమ్‌జీ 48 స్థానంలో నిలువగా 92వ స్థానంలో శివ్ నాడర్ ఉన్నారు. 96వ స్థానంలో ఉదయ్ కొటక్ నిలిచారు.

English summary
Microsoft Corp co-founder Bill Gates, who has never been ranked below the second spot on the Bloomberg Billionaires Index has been pushed to the Number 3 rank by Bernard Arnault, Chairman and Chief Executive Officer of LVMH Moet Hennessy - Louis Vuitton SE, aka LVMH.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X