వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్ గేట్స్ తొలి ట్రిలియనీర్ కాబోతున్నారు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ట్రిలియనీర్ కాబోతున్నారు. వచ్చే ఇరవై అయిదేళ్లలో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు.

|
Google Oneindia TeluguNews

హూస్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ట్రిలియనీర్ కాబోతున్నారు. వచ్చే ఇరవై అయిదేళ్లలో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ సంస్థ తన పరిశోధనా నివేదికలో దీనిని వెల్లడించింది.

పన్నులు వేయను కానీ, షరతు: సీఈవోలకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చి, ట్రంప్ వార్నింగ్

బిల్ గేట్స్ ట్రిలియనీర్‌గా అయ్యే సమయానికి ఆయన వయస్సు 86 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. ఆయన ఆస్తులు 2009 నుంచి ప్రతి ఏటా సుమారు పదకొండు శాతంతో వృద్ధి చెందుతున్నాయి.

కనీసం వంద కోట్ల డాలర్లు ఉంటే బిలియనీర్. ట్రిలియనీర్ అంటే లక్ష కోట్ల డాలర్ల కంటే ఎక్కువే ఉన్నట్టు. ఇది భారతీయ కరెన్సీలో చెప్పాలంటే.. రూ.68 లక్షల కోట్లుగా అంచనా వేయవచ్చు.

Bill Gates World's First 'Trillionaire'? A Word Still Not In Dictionary

ఆయన వద్ద ప్రస్తుతం 84.6 బిలియ‌న్ డాల‌ర్ల సంపద ఉంది. భారతీయ క‌రెన్సీలో చెప్పాలంటే 5 ల‌క్ష‌ల 76 వేల కోట్లు. ఇది 25 ఏళ్ల‌ల్లో 68 ల‌క్షల కోట్లు అయితే అప్పుడు అత‌ను ట్ర‌లియ‌నీర్‌గా మారుతారు.

2006లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్‌ను వ‌దిలిన‌ప్పుడు ఆయ‌న ఆస్తులు 50 బిలియ‌న్ల (5 వేల కోట్ల) డాల‌ర్లు. 2016లో ఆయ‌న సంప‌ద 75 బిలియ‌న్ల డాల‌ర్లకు చేరుకుంది. ఛారిటీ సంస్థ ద్వారా విరాళాలు ఇస్తున్నా, బిల్ గేట్స్ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి.

ఫోర్బ్స్ వెల్లడించిన జాబితాలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ఇండిటెక్స్ ఫౌండర్ అమాన్సియో ఒర్టెగా, కార్లోస్ స్లిమ్, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్, 'ఫేస్ బుక్ ' మార్క్ జుకర్ బర్గ్, న్యూయార్క్ మాజీ మేయర్ మైకేల్ బ్లూమ్‌బర్గ్, 'ఒరాకిల్' లారీ ఎలిసన్‌లు ఉన్నారు.

English summary
Microsoft founder Bill Gates will be world's first trillionaire in the next 25 years, according to a new research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X