వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌తో.. బిల్‌ గేట్స్ ఢీ! ‘అమెరికా ఫస్ట్’ భావనే తప్పు, అలాంటివి మానుకోండి, మెలిండా హితవు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న 'అమెరికా ఫస్ట్' విధానాన్ని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తప్పుబట్టారు. అసలు ఈ భావనే తప్పు అంటూ.. 'బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌' తరఫున వెలువరించిన లేఖలో పేర్కొన్నారు.

బిల్ గేట్స్ తన భార్య మెలిండాతో కలిసి ప్రతి సంవత్సరం తమ ఫౌండేషన్ తరుపున ఒక లేఖను విడుదల చేస్తారు. ఈ ఏడాది విడుదల చేసిన లేఖలో తన అభిప్రాయాలను ఆయన నిక్కచ్చిగా వెల్లడించారు.

‘అమెరికా ఫస్ట్’.. అసలు ఇదే తప్పు...

‘అమెరికా ఫస్ట్’.. అసలు ఇదే తప్పు...

అమెరికాలోని ఉద్యోగాల్లో అమెరికన్లకే ఎక్కువగా అవకాశాలు కల్పించి.. విదేశీయుల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్' అనే విధానమే తప్పుడు విధానమని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేర్కొన్నారు. ‘అమెరికన్ల క్షేమం, వారి అవసరాల గురించి ఆలోచించకూడదనేది నా అభిప్రాయం కాదు.. కానీ వారి అభ్యున్నతికి మనం ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామనేది ముఖ్యం. ‘అమెరికా ఫస్ట్‌' విధానం ఈ దిశగా రూపొందించినదేనా? ఈ భావనే నన్ను ఆందోళనకు గురిచేస్తోంది..' అని ‘బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌' తరఫున పదోసారి వెలువరించిన లేఖలో బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

అమెరికన్లకు అదే ప్రయోజనం...

అమెరికన్లకు అదే ప్రయోజనం...

‘కలిసి ఉంటే కలదు సుఖం' అనే భావననే బిల్ గేట్స్ కూడా వ్యక్తపరిచారు. ప్రపంచ దేశాలతో కలిసి మెలిసి సాగడం వల్ల అమెరికా సహా అందరికీ లాభమని అన్నారు. ప్రపంచ దేశాలతో బంధం నుంచి వైదొలగడం వల్ల అమెరికాకు కలిగే ప్రయోజనం శూన్యమన్నారు. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైందని, లెక్కలు తీసి చూస్తే.. బయటి దేశాలతో కలిసి పయనించడం వల్ల అమెరికన్లకు ఏ మేరకు సాయం జరిగిందన్నది తేలుతుందని, నిజానికి ప్రపంచ దేశాలతో కలిసి మెలిసి సాగడమే తెలివైన పెట్టుబడి అని బిల్ గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు.

సాయంలో కోత.. మనకే మంచిది కాదు...

సాయంలో కోత.. మనకే మంచిది కాదు...

ట్రంప్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు.. ముఖ్యంగా వర్ధమాన దేశాలకు సాయంలో కోతలు విధించడంపై కూడా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘గతంలో ప్రభుత్వాధినేతలను, చట్టసభల ప్రతినిధులను కలిసినట్లే మేం ట్రంప్‌ను కూడా చాలాసార్లు కలిశాం. మా అభిప్రయాలను ఆయనకు వివరించాం. అయితే గతంలోని ప్రభుత్వాలకంటే కూడా ప్రస్తుత ప్రభుత్వంతోనే మేం కాస్త ఎక్కువగా విభేదిస్తున్నాం..' అని గేట్స్ పేర్కొన్నారు.
విదేశాలకు సాయం తగ్గించడం వల్ల అమెరికాకే నష్టమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా ఉద్యోగాల కల్పనే కదా?

ఇది కూడా ఉద్యోగాల కల్పనే కదా?

ట్రంప్ విధానాల కారణంగా తమ ‘బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌' ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పటికీ ఎదుర్కొంటోందని బిల్ గేట్స్ ఆరోపించారు. ‘ ప్రపంచంలోని పలు దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆకలితో, వ్యాధులతో అలమటించడం వల్ల ప్రపంచం సురక్షితంగా ఉండలేదు. వ్యాధులు, పేదరిక నిర్మూలనలో అమెరికా.. ప్రపంచంలోనే అగ్రగామి దేశం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడగలిగాం. మన పౌరులకు ఈ రంగాల్లో అవకాశాలు కల్పించడం ఉపాధి కల్పన కాదా? ఇలా చేయడం కూడా వారికి ఉద్యోగాలు కల్పించడమే కదా?' అని గేట్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మహిళలను కించపరచకండి...

మహిళలను కించపరచకండి...

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సతీమణి మెలిండా గేట్స్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, ట్వీట్లు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘అమెరికా విలువలను ప్రపంచం ముందు సమున్నతంగా ఆవిష్కరించేలా మీరు వ్యవహరించాలే తప్ప వాటిని దెబ్బతీసేలా కాదు..' అంటూ మెలిండా గేట్స్ తమ ఫౌండేషన్ తరుపున పదోసారి వెలువరించిన లేఖలో ట్రంప్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. అంతేకాదు, ‘ప్రజలందరినీ.. ముఖ్యంగా మహిళలను సమానంగా, గౌరవంగా చూడండి. అమెరికాను ఓ ఆదర్శవంతమైన దేశంగా నిలబెట్టండి. సమానత్వం అనేది ముఖ్యమైన జాతీయ సూత్రం.. ఇది మీకూ తెలుసు..' అని మెలిండా గేట్స్ వ్యాఖ్యానించారు.

English summary
In their latest annual letter, “The 10 Toughest Questions We Get,” Bill and Melinda Gates, whose foundation based in Seattle, Washington, spends around $500 million annually in the United States - most of it on education - and roughly $4 billion in developing countries to alleviate poverty and suffering, state that “it’s not fair that we have so much wealth when billions of others have so little.” They also express criticism of President Donald Trump. Responding to a series “tough questions” they have received over the years from nonprofit partners, government leaders, the general public as well as supporters and critics alike, the husband-and-wife team open the letter saying that they see a world that is getting better. They cite that the number of children who die each year has been cut in half since 1990 and extreme poverty has fallen by nearly half in just 20 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X