వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసీదులే అతని టార్గెట్: అయిదు ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసిన దుండగుడు!

|
Google Oneindia TeluguNews

బర్మింగ్ హామ్: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు రక్షణ కరవైన పరిస్థితులు నెలకొంటున్నాయా? క్రమంగా ప్రపంచ దేశాల్లో ఇస్లామోఫోబియా వ్యాపిస్తోందా? అంటే అవుననే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతతకు చిరునామాగా ఉండే న్యూజీలాండ్ లో కొద్దిరోజుల కిందట చోటు చేసుకున్న పరిణామాల అనంతరం అలాంటి ఘటనలే మరికొన్నినమోదయ్యాయి.

మిస్టర్ క్లీన్ సీఎం: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? <br>మిస్టర్ క్లీన్ సీఎం: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లోని రెండు మసీదుల్లో యథేచ్చగా కాల్పులు జరిపిన ఘటనలో 50 మంది ముస్లింలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తరువాత ముస్లింల ప్రార్థనా స్థలాలపై దాడులు తీవ్రం అయ్యాయి. తాజాగా- ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో ఏకంగా అయిదు మసీదులపై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దాడులకు పాల్పడ్డాడు.

Birmingham mosques attacked using sledgehammers, probe

సుత్తి తీసుకుని వరుసగా మసీదుల తలుపులు, కిటికీలను ధ్వంసం చేశాడు. వాటికి అమర్చిన అద్దాలను పగులగొట్టాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెస్ట్ మిడ్ ల్యాండ్స్ పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. యునైటెడ్ కింగ్ డమ్ ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక విభాగం పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

బర్మింగ్ హామ్ వెస్ట్ మిడ్ ల్యాండ్స్ లోని ఆల్బర్ట్ రోడ్ లో ఉన్న జామియా మసీద్ గౌసియా తలుపులు, కిటికీలకు అమర్చిన అద్దాలను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సుత్తితో పగుల గొడుతున్న దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదే ప్రాంతంలో ఉన్న మరో నాలుగు మసీదుల్లో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నప్పటికీ.. సీసీ కెమెరాల్లో నమోదు కాలేదు.

ఈ ఘటనలపై బర్మింగ్ హామ్ పార్లమెంట్ సభ్యురాలు షబానా మహమూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ దృశ్యాలు భయాన్ని కలిగించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బర్మింగ్ హామ్ మసీదుల కౌన్సిల్ ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, నిందితులన వదిలి పెట్టబోమని వెస్ట్ మిడ్ ల్యాండ్స్ పోలీసు అధికారి డేవ్ థామ్సన్ తెలిపారు. ఈ కేసును కౌంటర్ టెర్రర్ పోలీస్ విభాగం తమ ఆధీనంలోకి తీసుకుని, దర్యాప్తు చేస్తోందని చెప్పారు.

English summary
Five mosques in the English city of Birmingham were damaged overnight, police said on Thursday, in the latest in a spate of Islamophobic attacks in Britain since the murder of 50 people by a white supremacist at mosques in Christchurch, New Zealand. West Midlands Police said detectives and counterterrorism officers are investigating after windows were smashed at four mosques in Birmingham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X