వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో దున్న.. చిన్నారిని ఎత్తిపడేసిందిగా.. పార్కులో బీభత్సం (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా : సరదాగా గడుపుదామని కుటుంబ సభ్యులతో పార్కుకు వెళ్లిన ఓ ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. పార్కంతా అలా అలా చుట్టొచ్చి జంతువులు ఉండే చోటుకు వెళ్లిన క్రమంలో అక్కడున్న దున్న బీభత్సం సృష్టించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఎల్లోస్టోన్‌ నేషనల్ పార్కులో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జంతువులను దగ్గరగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా దున్న షాకిచ్చింది. దూరం నుంచి చూసినప్పుడు అది కామ్‌గానే కనిపించింది. అయితే దాని దగ్గరకు వెళ్లినప్పుడు మాత్రం ఒక్కసారిగా పైకి దూకింది. జంతువులు సాధారణంగా ఏమి చేయబోవనే ధీమాతో దాన్ని దగ్గరగా చూడాలనుకోవడమే వారికి షాకిచ్చింది.

bison thrown 9 year old girl into air at florida yellowstone park

చింతమడకకు 200 కోట్లా.. రాష్ట్రానికి సీఎం కాదా.. కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్అచింతమడకకు 200 కోట్లా.. రాష్ట్రానికి సీఎం కాదా.. కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్అ

ప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ దున్న అకస్మాత్తుగా బీభత్సం స‌ృష్టించింది. అలా ఆ కుటుంబ సభ్యులు దగ్గరకు రాగానే ఎగిరి వారిపైకి దూకింది. అయితే ఆ కుటుంబంలోని పెద్దలు ఉరుకులు పరుగులు పెడుతూ తప్పించుకున్నారు. ఆ సమయంలో భయాందోళన కారణంగా వారితో పాటు ఉన్న తొమ్మిదేళ్ల చిన్నారిని చూడకుండా పరుగులు పెట్టారు. దాంతో ఆ చిన్నారి మాత్రం దున్న బారి నుంచి తప్పించుకోలేకపోయింది.

సినిమా సీన్ తలపించేలా ఆ దున్న తన కొమ్ములతో చిన్నారిని అమాంతం పైకి లేపి కిందకు విసిరిసేంది. అయితే ఆ చిన్నారికి పెద్దగా గాయాలు కాలేదు. స్వల్ప గాయాలతో బయటపడింది. ఆ సన్నివేశమంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ కామెంటుతున్నారు.

English summary
Things escalated quickly when a bison spotted this 9 year old girl at Yellowstone National Park at Florida. Luckily, she's OK. Her parents are the ones running away in the background, according to the witness who shot this video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X