వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని బిట్ కాయిన్ పతనం... 6,000 డాలర్ల లోపునకు పడిపోయిన క్రిప్టోకరెన్సీ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఏడాది వ్యవధిలోనే 900 డాలర్ల నుంచి 20,000 డాలర్లకు పెరిగి మదుపరులను ఊహల పల్లకీలో ఊరేగించిన బిట్ కాయిన్... పతనం ఆగడం లేదు. మంగళవారం లగ్జెంబర్గ్ బిట్ స్టాంప్ ఎక్సేంజ లో ఒక బిట్ కాయిన్ ధర 5,995.58 డాలర్లకు (సుమారు రూ.3.85లక్షలు) పడిపోయింది.

షాకింగ్: బిట్ కాయిన్ ఎక్స్ఛేంజ్ చీఫ్ కిడ్నాప్షాకింగ్: బిట్ కాయిన్ ఎక్స్ఛేంజ్ చీఫ్ కిడ్నాప్

అసలేంటీ ఈ బిట్ కాయిన్.. కరెన్సీకి ప్రత్యామ్నాయమా? ఎలా?అసలేంటీ ఈ బిట్ కాయిన్.. కరెన్సీకి ప్రత్యామ్నాయమా? ఎలా?

క్రిప్టో కరెన్సీగా పిలిచే బిట్ కాయిన్ గరిష్ట ధర గత డిసెంబర్‌లో 20,000 డాలర్లు (రూ.12.86 లక్షలు)తో పోల్చి చూస్తే.. మూడింట రెండొంతుల బిట్‌కాయిన్ విలువ ఆవిరైపోయిందనే చెప్పొచ్చు. ఈ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పరుగులకు ఆకర్షితులై మన దేశంలోనూ దీనిపై మదుపు చేసే వారి సంఖ్య గడిచిన ఏడాదిలో గణనీయంగానే పెరిగింది.

Bitcoin continues to tumble, briefly breaking below $6,000

ప్రపంచ ఆర్థిక రంగానికి, దేశాల అధికారిక కరెన్సీలకు హానికరంగా మారిన బిట్‌ కాయిన్‌పై పలు దేశాలు కఠిన చర్యలకు ప్రయత్నిస్తుండడం దీని పతనానికి కారణం. ముఖ్యంగా బ్రిటన్, అమెరికాలోని బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా బిట్ కాయిన్ల కొనుగోలుకు బ్రేక్ వేశాయి.

మన దేశంలోనూ బిట్ కాయిన్‌ను అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి కఠిన నిర్ణయాలు, చర్యలు ఈ డిజిటల్ కరెన్సీ విలువను తుడిచిపెట్టేస్తున్నాయి. సాంకేతికంగా చూస్తే బిట్ కాయిన్ విలువ 5,000 డాలర్ల వరకు క్షీణించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

English summary
Bitcoin dropped to its lowest in more than two months.The digital currency fell to a low of $5,995.58, its lowest since mid November, according to CoinDesk, whose bitcoin price index tracks prices from four major exchanges. At a price of $6,115.46 at 2:44 p.m. HK/SIN, the cryptocurrency was down more than 11.5 percent on the day, according to CoinDesk. The site measures bitcoin based on Coordinated Universal Time — currently the same time zone as the U.K. With that decline, bitcoin has now lost more than 50 percent for the year so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X