వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు సిసలు బలపరీక్ష: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నీ: గెలిస్తే రూ. వేలల్లో బహుమతులు

|
Google Oneindia TeluguNews

మాస్కో: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నమెంట్! వినడానికి ఆశ్చర్యంగా, అంతకుమించి వింతగా ఉంది కదూ! నిజమే. ఏటా వారాంతపు రోజుల్లో జరిగే ఈ టోర్నమెంట్ లో పాల్గొని, తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు పోటీదారులు. మూడే మూడు చెంపదెబ్బలు కొట్టి, ప్రత్యర్థిని నేల కరచుకునేలా చేస్తే.. వేల కొద్దీ రూపాయలు ఒళ్లో వచ్చి పడతాయి మరి. ప్రత్యర్థి కొట్టే దెబ్బలను తిని, నిలబడగలిగితే చాలు.. టోర్నమెంట్ మనదే అవుతుంది.

బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరు బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరు

ఈ వింత టోర్నీ.. రష్యాలోని క్రాస్నోయార్క్స్ పట్టణంలో నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి- వారాంతపు రోజుల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. టోర్నమెంట్ అనే సరికి కంగారు పడుతుంటారు చాలామంది పోటీదారులు. ఈ టోర్నీ మాత్రం వాటన్నింటికీ భిన్నం. మన చేతుల్లో బలం, ప్రత్యర్థి కొట్టే చెంపదెబ్బలను తట్టుకునే సామర్థ్యం మనకు ఉంటే చాలు. పెద్దగా కసరత్తు చేయాల్సిన పనీ ఉండదు.

 Bizarre Slapping Championship In Russias Siberian Power Show sports festival

ఈ టోర్నీ, గేమ్ ఎలా కొనసాగుతుందంటే- వేదిక మీద ఓ టేబుల్ ఉంటుంది. దానికి చెరో పక్క ఇద్దరు పోటీదారులు నిల్చుంటారు. ఓ కామెంటేటర్ కమ్ అంపైర్ ఉంటారు. ఈ పోటీదారులు ఇద్దరూ పరస్పరం ఒకరి చెంపను ఒకరు పగులగొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ దయాదాక్షిణ్యాలకు చోటు ఉండదు. ఎంత గట్టిగా కొట్ట గలిగితే.. అంతగా టైటిల్ కు చేరువ అవుతారు. మూడు సార్లు మాత్రమే ఛాన్స్. ఈ మూడు ఛాన్సుల్లో చెంపను పగుగొట్టాల్సి ఉంటుంది. ఈ మూడు చెంపదెబ్బల్లో ప్రత్యర్థిని పడగొట్టేయాల్సిందే. అలా చేసిన పోటీదారుడిని విజేతగా ప్రకటిస్తారు. చెంప కందిపోయినందుకు.. ట్రీట్ మెంట్ ఫ్రీ.

విజేతకు రష్యాన్ కరెన్సీలో 30 వేల రూబుళ్ల బహుమానాన్ని ఇస్తారు నిర్వాహకులు. 30 వేల రూబుళ్లు అంటే మన దేశీయ రూపాయితో పోల్చుకుంటే 32 వేల రూపాయలన్న మాట. ఈ ఏడాది జరిగిన పోటీల్లో వాసిలీ కామోట్స్కీ అనే యువకుడు విజేతగా నిలిచాడు. సైబీరియన్ పవర్ షో స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా.. ఈ టోర్నీని నిర్వహిస్తుంటారు.

English summary
We can all agree that getting slapped in the face repeatedly is not something anyone would sign up for willingly – unless of course you’re participating in a “slapping championship,” which is apparently a real thing. “Male Slapping Championships” were held over the weekend in the Russian city of Krasnoyarsk, and the rules were pretty simple: Two men stand in front of each other across a table and slap each other until one of them concedes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X