వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో.. 7 గంటలు... మహిళ నరకయాతన.... సిబ్బంది తీరుపై ఆగ్రహ జ్వాల

|
Google Oneindia TeluguNews

కొన్ని నిబంధనలు ప్రయాణికుల మెడపై గుదిబండగా మారుతాయి. దీనికితోడు కొందరు తలబిరుసు ఉద్యోగాలు తోడయితే ఇక అంతే.. ఆ ప్రయాణికులను సాక్షాత్ దేవుడు కూడా కాపాడలేదు. అవును అచ్చంగా ఇలాంటి ఘటనే ఒకటి కెనడాలో జరిగింది. ఓ ప్రయాణికురాలిపై విమాన సిబ్బంది నిబంధనల పేరుతో వేధించారు. దీంతో ఆమె తన మూత్రంపైనే కూర్చొని నిరసన తెలిపారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అమ్మ.. బ్యాంకు సిబ్బంది... పని ఒత్తిడిలో తాళం వేయడమే...అమ్మ.. బ్యాంకు సిబ్బంది... పని ఒత్తిడిలో తాళం వేయడమే...

సరికాదు

సరికాదు

కెనడాకు చెందిన 26 ఏళ్ల యువతి స్వస్థలం డబ్లిన్, ఆమె పని నిమిత్తం కొలంబో వెళ్లి తిరిగి ఎయిర్ కెనడా విమానంలో డబ్లిన్ వస్తున్నారు. అయితే విమాన సిబ్బంది ప్రవర్తనతో ఆమెకు చిరెత్తిపోయారు. వారికి తగ్గట్టు ప్రవర్తించి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. మరోసారి ఆ సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాలంటే ఒళ్లు గగుర్పొడిచేలా చేశారు.

రెండు గంటలు ఆలస్యం

రెండు గంటలు ఆలస్యం

ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణికులు అంతా కూర్చొన్నారు. అయితే విమానం టేకాఫ్ ఆలస్యమైంది. అరగంట కాదు గంట కాదు ఏకంగా రెండుగంటల పాటు లేటయ్యింది. విమాన నిబంధనల ప్రకారం విమానం టేకాఫ్ అయితే తప్ప ప్రయాణికులను టాయిలెట్‌కు పంపించారు. ఇదే ఆ మహిళకు చుక్కలు చూపించింది. ఆమె అర్జెంట్‌గా టాయిలెట్ వచ్చింది. కానీ సిబ్బంది కనికరించలేదు. మానవత్వం కూడా చూపకుండా కఠినంగా ప్రవర్తించారు.

కనికరించని వైనం

కనికరించని వైనం

నాకు టాయిలెట్ వస్తుందిరా మొర్రో అంటే కాసేపు ఆగండి అని సమాధానం ఇచ్చారు. ఇలా అరగంటకోసారి నాలుగుసార్లు విమాన సిబ్బందిని యువతి అడిగారు. అయినా వారు చెప్పిన సమాధానమే చెప్పి విసుగు తెప్పించారు. టాయిలెట్ అయితే ఓకే, ఇంకా ఏమైనా అత్యవసరం అయితే ఏం చేయాలి. ప్రమాదం ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యులు అని ఆమె ప్రశ్నించారు. కానీ విమాన సిబ్బంది సమాధానం మాత్రం మారలేదు.

సీట్లోనే పనికానిచ్చేశారు

సీట్లోనే పనికానిచ్చేశారు

దీంతో చేసేదీలేక ఆ యువతి తన సీట్లోను పని కానిచ్చేశారు. అలా ఆమె చేస్తుంటే మెలకువ వచ్చిన సిబ్బంది వద్దు మొర్రో అని అడిగారు. కానీ వారి కంటే మొండి అయిన యువతి పట్టించుకోలేదు. పని కానిచ్చేశారు. కానీ తర్వాత అదే సీట్లో కూర్చొన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 గంటలు ఆశీనులయ్యారు. మరో చోట కూర్చొవాలని, సహకరించాలని కోరినా యువతి వినిపించుకోలేదు. ముందు చెపితే ఎందుకు పట్టించుకోలేదని యువతి మండిపడ్డారు.

7 గంటలపాటు

7 గంటలపాటు


అలా సమయాన్ని కళ్లలో వత్తులు వేసుకొని ప్రయాణించారు. అలా ఏడు గంటలు గడిచాక గమ్యస్థానం చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఒక గది బుక్ చేసుకొని.. అక్కడే స్నానం చేసి ప్రెష్ అయ్యారు. ఆ విమాన సిబ్బందిపై మాత్రం ఒంటికాలిపై లేచారు. ప్రయాణికులతో మసలుకొనే విధానం ఇదా అని ప్రశ్నించారు. తర్వాత జరిగిన ఘటనను విమానాశ్రయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీనిపై శాఖపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని యువతికి వారు హామీనివ్వడంతో వెనుదిరిగారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని యువతి డిమాండ్ చేశారు.

English summary
26-year-old woman was flying back to Dublin from Bogota in Columbia. flight was delayed for two hours. The woman wont allow to the lavatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X