వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్థాన్లో పేలుడు.. ఒకరు మృతి.. 12 మందికి గాయాలు
పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. బాంబు పేలుడుో కరాచీ ఖారదర్ ప్రాంతం దద్దరిల్లింది. బోల్టన్ మార్కెట్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. పేలుడులో ఒకరు చనిపోగా.. మరో 12 మందికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి మహిళ అని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన తర్వాత భారీగా శబ్దం వినిపించింది. దీంతో అక్కడికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు.

పేలుడుకు గల కారణం తెలియరాలేదు.పేలుడు పదార్థం వల్లే జరిగి ఉంటుందని సామ టీవీ పేర్కొంది. పేలుడు జరిగిన బోల్టన్ మార్కెట్ ఏరియా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావడం విశేషం. గత నెలలో కూడా ఆత్మహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. కరాచీ యూనివర్సిటీలో దాడితో ముగ్గురు చైనా టీచర్లు, ఒకరు స్థానికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పేలుడు జరిగింది.
Comments
English summary
woman was killed and 12 others have been injured in an explosion in Karachi’s Kharadar. blast took place in the Bolton Market area of the port city.
Story first published: Monday, May 16, 2022, 23:54 [IST]