వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్‌లో వరుస పేలుళ్లు, సైన్యం-తీవ్రవాదుల మధ్య కాల్పులు: 10మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో మరోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా దాదాపు యాభై మందికి పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పెషావర్‌లోని హయతాబాదు ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

Blasts, firing near mosque in Peshawar; 2 killed, 20 injured

ఇందులో ఓ పేలుడు సమీపంలోని మసీదు బయట చోటు చేుకుంది. స్థానిక డాన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం... ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాదు, కాల్పులు కూడా జరిగాయని తెలుస్తోంది.

సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు

సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మసీదులో కొందరిని ఉగ్రవాదులు బంధించారని సమాచారం. సంఘటన స్థలాన్ని పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సందర్శించారు. మసీదు బయట పేలుళ్లకు గ్రెనేడ్లు వినియోగించినట్లుగా తెలుస్తోంది.

English summary
At least two people were killed and 20 others injured on Friday when multiple blasts took place in Hayatabad area of Peshawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X