వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మంచు తుఫాన్: 19 మంది మృతి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాని మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. మంచు ప్రభావంతో అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 19 మంది మరణించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌, న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో జన జీవనం దాదాపుగా స్తంభించిపోయింది.

ముఖ్యంగా న్యూయార్క్ నగరం, దాని శివారు ప్రాంతాలు పూర్తింగా మంచుతో కప్పబడ్డాయి. రవాణా దాదాపు నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్థానిక, రాష్ట్ర రోడ్లపై ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు న్యూయార్క్ స్టేట్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు.

మరోవైపు రాజధాని వాషింగ్టన్‌ డిసితో సహా పలు ప్రధాన నగరాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. వాషింగ్టన్‌లో 30 అంగుళాల కంటే ఎక్కువ మందాన మంచు పేరుకుంది. బస్సులు, రైళ్ల సర్వీసులను నిలిపేశారు. మ్యూజియంలు, షాపింగ్ కాంప్లెక్స్‌లను కూడా మూసివేశారు.

అమెరికాలో మంచు తుఫాన్

అమెరికాలో మంచు తుఫాన్

తుఫాన్‌ తీవ్రత అంచనాలను మించిపోయినట్టు వాతావరణశాఖ పేర్కొంది. దేశాన్ని ఆవరించిన మంచు తుఫాన్‌ ప్రభావాన్ని రోదసి నుంచి చిత్రించిన ఫోటో గ్రాఫ్‌లను న్యూయార్క్‌ స్పేస్‌ ఏజెన్సీ విడుదల చేసింది. న్యూయార్క్‌ మహానగరంలోని ప్రఖ్యాత సెంట్రల్‌ పార్క్‌ మంచుదుప్పటిలో కూరుకుపోయింది.

అమెరికాలో మంచు తుఫాన్

అమెరికాలో మంచు తుఫాన్

మంచు తీవ్రత ఒక్కసారిగా ఎక్కువ అవడంతో మంచు వాతావరణాన్ని ఆశ్వాదించడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. ఈ మంచు అత్యంత ప్రమాదకరమైనదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు వీలైనంతవరకు ఇళ్లనుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికాలో మంచు తుఫాన్

అమెరికాలో మంచు తుఫాన్

న్యూయార్క్‌లో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో ప్రపంచ ప్రఖ్యాత నాటక ప్రదర్శన శాల బ్రాడ్‌వే మూతపడింది. హడ్సన్ నదికి అనుసంధానంగా ఉన్న వంతెనలు, సొరంగాల్లో ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ప్రకటించారు.

అమెరికాలో మంచు తుఫాన్

అమెరికాలో మంచు తుఫాన్

ఎమర్జెన్సీ వాహనాలు, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షక సిబ్బంది, వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. మేయర్ బిల్ డీ బ్లసియో ఓ ప్రకటనలో ప్రజలను అప్రమత్తం చేశారు.

English summary
A blizzard that has paralyzed much of the U.S. East Coast intensified on Saturday, bringing Washington to a standstill and forcing the closure of roads, bridges and tunnels into New York until Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X