ఇవాళ రాత్రి అరుదైన బ్లూ మూన్ కనువిందు- నీలి చంద్రుడి విశేషాలివే..
ప్రతీ ఏటా అక్టోబర్ 31న ఆకాశంలో నీలి చంద్రుడు దర్శనమిస్తుంటాడు. దీని వెనుక చాలా విశేషాలున్నాయి. వినీలాకాశంలో ఏడాదికి ఒకసారి దర్శనమిచ్చే నీలి చంద్రుడికి సంబంధించి ఎన్నో విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని తెలుసుకునేందుకు గతంలో ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. వాస్తవానికి బ్లూమూన్ అనేది ఏడాదికి 12సార్లు ఆకాశంలో కనిపించే పౌర్ణమి మినహా మరే గొప్పదనం లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. ఏడాదిలో 12 సార్లు పౌర్ణమి వస్తుంది. ఇది ప్రతీ నెలా ఒకసారి వస్తుంది. ఇలా వచ్చే ప్రతీ పౌర్ణమికీ అనేక సంస్కృతుల వారు అనేక పేర్లతో పిలుస్తుంటారు. ఇవి పలు దేశాల్లో పలు పేర్లతో ప్రాచుర్యం పొందినా ఎక్కువగా పిలిచే వాటికి అరుదైన పేర్లుగా గుర్తింపు లభించింది. ఇలాంటి వాటిలో బ్లూమూన్ కూడా ఒకటి.

బ్లూ మూన్ అంటే ఏంటి ?
సంప్రదాయ నిర్వచనం ప్రకారం బ్లూమూన్ అనేది ఓ సీజన్ యొక్క మూడో పౌర్ణమిగా చెప్పుకుంటారు. పలు దేశాల్లో ఇదే నిర్వచనం అమల్లో ఉంది. కానీ అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా ప్రకారం అయితే ఈ సంప్రదాయక నిర్వచనం ఈ విషయంలో మాత్రం తప్పు. ఎందుకంటే అక్టోబర్ 1-2 తేదీల్లో ఈ నెల పౌర్ణమి వచ్చేసింది. కాబట్టి ఈ నెల చివరి రోజు అయిన 31న రెండో పౌర్ణమిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలలో రెండో పౌర్ణమి అయిన బ్లూమూన్ను సీజన్ మూడౌ పౌర్ణమిగా ఎలా చెబుతామని నాసా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటుంది.

బ్లూ మూన్ అని దేన్ని పిలుస్తారు
నాసా పరిశోధనల ప్రకారం, 1883 లో క్రాకాటోవా అనే ఇండోనేషియా అగ్నిపర్వతం పేలుడు తర్వాత బూడిద మేఘాల ఆకాశంలోకి వెళ్లింది. ఈ మేఘాలు బూడిద లేదా ఎరుపు రంగు కాంతిని చంద్రుడి వద్ద ప్రసరింపజేశాయి. ఈ అరుదైన దృశ్యమే బ్లూమూన్గా పేరు చ్చుకుంది. ఈ బ్లూమూన్ ఏటా అక్టోబర్ 31న పునరావృతమవుతోంది. వాస్తవానికి సంవత్సరంలో 12 పౌర్ణములు వస్తాయి. ప్రతీ నాలుగు సీజన్లలో మూడేసి పౌర్ణములు 29.5 రోజులకోసారి వస్తాయి. దీని ప్రకారం చూస్తే చంద్రుడు 12 దశలు పూర్తి చేయడానికి 354 రోజులు పడుతుంది. మిగిలిన రెండు రోజులు ప్రతీ రెండున్నర సంవత్సరాలకోసారి 13 క్యాలెండర్ సంవత్సరాల్లో 13 చంద్రుల చొప్పున కనిపిస్తాయి. ఈ 13వ పౌర్ణమి అరుదైన ఘటన కాబట్టి దీన్ని బ్లూమూన్గా చెప్తుంటారు.

బ్లూ మూన్ నీలిరంగులోనే ఉంటుందా
వాస్తవానికి బ్లూమూన్ నీలి రంగులోనే ఉండదు. అన్ని పౌర్ణమి చంద్రుల మాదిరిగానే ఎక్కువ ప్రకాశవంతంగా, తెల్లగా ఉంటుంది. అయినా నీలిరంగు చంద్రుడు కనిపించాలంటే ఓ అరుదైన కాంబినేషన్లో కాంతి కిరణాలు ప్రసరించాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్ధితులు కూడా అవసరం. టైమ్ అండ్ డేట్ డాట్ కామ్ అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 31న బ్లూమూన్ పౌర్ణమి రాత్రి 8.15 తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు బ్లూమూన్ పేరుపైనా ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదు. దీన్ని ఎవరూ కచ్చితంగా నిర్ణయించలేదు కూడా. కానీ నేషనల్ జియోగ్రాఫిక్ మాత్రం బ్లూమూన్ మినహా మిగతా 12 నెలల్లో వచ్చే పౌర్ణమి చంద్రులకు ఒక్కో పేరు పెట్టింది. వీటి పేర్లు ఇలా ఉన్నాయి.
జనవరి: వోల్ఫ్ మూన్
ఫిబ్రవరి: స్నో మూన్
మార్చి: వార్మ్ మూన్
ఏప్రిల్: పింక్ మూన్
మే: ఫ్లో మూన్
జూన్: స్ట్రాబెర్రీ మూన్
జూలై: బక్ మూన్
ఆగస్టు: స్టర్జన్ మూన్
సెప్టెంబర్: హార్వెస్ట్ మూన్
అక్టోబర్: హంటర్స్ మూన్
నవంబర్: బీవర్ మూన్
డిసెంబర్: కోల్డ్ మూన్