వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు మార్చుకున్న ఉగ్ర సంస్ధ బోకో హరామ్... ఇకపై 'ఇస్లామిక్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అబుజా: ప్రపంచాన్ని తన ఉగ్రవాదంతో వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా తన ప్రాబల్యాన్ని మరింతగా విస్తరిస్తోంది. నైజీరియాలో మారణహోమం సృష్టిస్తోన్న తీవ్రవాద సంస్ధ బోకో హరామ్‌ను విలీనం చేసుకుంది. ఇక నుంచి బోకో హరామ్‌ తన పేరును 'ఇస్లామిక్ స్టేట్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా' గా మార్చుకుంది.

మార్చి 2015న ఐఎస్ఐఎస్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాము సిద్ధమేనని బోకో హరామ్‌ చీఫ్ అబూ బకర్ షీకు వ్యాఖ్యానించిన తర్వాత ఈ విలీనం జరిగినట్లు తెలుస్తోంది. బోకో హరామ్‌ అంటే 'పశ్చిమ దేశాల విద్యను మరిచిపోవాలి' అనే అర్ధం వస్తుంది. నైజీరియాలో బాగా ప్రాచుర్యం పొందిన బోకో హరామ్‌ తీవ్రవాద సంస్ధలో ప్రస్తుతం 15వేలకు పైగా సభ్యులున్నారు.

గత ఆరు సంవత్సరాలుగా నైజీరియాలో ఇస్లామిక్‌ ప్రాబల్యం పెంచేందుకు గాను వేల మందికి చంపగా, వందల మందిని కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే ధ్యేయంగా 2009లో బోకో హరామ్‌ ఉగ్రవాద పోరాటాన్ని ప్రారంభించారు. నిరుడు నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని అనేక గ్రామాలు, పట్టణాలను బోకో హరామ్‌ హస్తగతం చేసుకుంది.

Boko Haram changes name to ‘Islamic State in West Africa’

అప్పుడు జరిగిన పోరాటంలో దాదాపు 15 లక్షల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. గత ఏడాది మొత్తంమీద 2000 మందిని పొట్టన పెట్టుకున్నారు. బాగా పట్టణంలో దాదాపు పది వేల మంది జనాభా ఉన్నారని, ఇప్పుడు మొత్తంగా ఆ పట్టణమే కనిపించకుండా పోయిందని అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్న ప్రజలు తనకు చెప్పినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి మూసా అల్హాజి బుకర్‌ తెలిపారు.

పట్టణాన్ని పూర్తిగా తగలబెట్టేశారని చెప్పారన్నారు. బాగా పట్టణంతోపాటు దానిని ఆనుకుని ఉన్న 16 గ్రామాలను బోకోహరామ్‌ ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకున్నారని బుకర్‌ చెప్పారు.

English summary
Terrorist group Boko Haram has changed its name to ‘Islamic State in West Africa.’ following its affiliation with Islamic State of Iraq and Syria (ISIS), reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X