వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబుల్‌ పెళ్లి వేడుకలో బాంబు పేలుడు,40 మంది మృతి, మరో 100 మందికి గాయాలు..!

|
Google Oneindia TeluguNews

అఫ్గానిస్థాన్‌లో తీవ్రవాదులు భారి పేలుడుకు పాల్పడ్డారు. మైనారీటిలోని ఓ వర్గంపై బాంబు దాడి చేశారు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న షియా ముస్లిం వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్‌లో బాంబు పేలుడు సంభవించింది.. దీంతో సుమారు 40 మంది వరకు మృతి చెందగా ,మరో 100 మంది వరకు గాయాల పాలైనట్టు సమాచారం. పెళ్లి వేడుకను లక్ష్యాంగా చేసుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Bomb blast in Kabul 40 of people were killed

కాగా సంఘటనపై స్పందించిన అఫ్గాన్‌మంత్రి నుస్రత్ రహిమి స్పందించారు. దాడులు ఎవరు,ఎందుకు చేశారనే ప్రాధమిక సమాచారం లేదని అన్నారు. అయితే సాధరణంగా తాలిబాన్‌తో పాటు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ మధ్య సాధరణంగా దాడులు చేస్తుంటాయి. ఇక గత వారం ఆగస్టు 7న కూడ కాబుల్‌లో కారు బాంబు పేలింది. దీంతో 14 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 150 మంది వరకు గాయలపాలయ్యారు.గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు.

ఇక కాబుల్‌లోనే అత్యంత సంపన్నుల వేడుకలతో పాటు, కమ్యూనిటి హాళ్లు ఎక్కువగా ఉండడంతో పాటు, సభలు సమావేశాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అంత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ఉండే కాబుల్‌ను తీవ్రవాదులు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో మనుష్యులను టార్గెట్ చేసి ,ఆత్మహుతి దాడులకు ఎలా పాల్పడతారని అఫ్గాన్ అధ్యక్షుడి కార్యాలయం ట్విట్ చేస్తూ దాడిని తీవ్రంగా ఖండించింది.

English summary
an explosion ripped through a wedding hall on a busy Saturday night in Afghanistan’s capital and 40 of people were killed 100 people wounded
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X