వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్లో ఫ్లైట్: బాంబు ఉందని ప్రయాణికుడి హంగామా

|
Google Oneindia TeluguNews

సోఫియా: విమానంలో బాంబు పెట్టారని ఓ ప్రయాణికుడు బెదిరించాడు. హడలిపోయిన అధికారులు పోలాండ్ నుంచి ఈజిప్టు వెళుతున్న ఆ విమానాన్ని మార్గం మద్యలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

విమానాశ్రయం సిబ్బంది వెంటనే విమానం దగ్గరకు పరుగులు తీశారు. విమానంలోని ప్రయాణిస్తున్న ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దింపేశారు. విమానం మొత్తం గాలించినా ఎలాంటి బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

వార్సా నుంచి ఈజిప్టులోని రిస్టార్ట్ నగరంలోని హర్గదా కు విమానం బయలుదేరింది. ఇదే విమానంలో 64 ఏళ్ల ప్రయాణికుడు ఉన్నారు. మార్గం మధ్యలో విమానంలో బాంబు పెట్టారని సాటి ప్రయాణికులకు చెప్పి అందిరిని షాక్ కు గురి చేశారు.

Bomb threat: Plane makes emergency landing in Bulgaria

విషయం తెలుసుకున్న పైలెట్ విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చాడు. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చెయ్యడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. బల్గేరియా రాజధాని సోఫియాలో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

వెంటనే విమానంలో సోదాలు చేసినా ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు చేసిన 64 ఏళ్ల ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని బల్గేరియా మీడియా తెలిపింది. ఆయన ఎందుకు బాంబు బెదిరింపు చేశాడు అని తెలియడం లేదని అధికారులు అంటున్నారు.

గత నెల 31వ తేదిన ఈజిప్టులోని రిస్టార్ట్ నగరం నుంచి బయలుదేరిన రష్యా విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నగరం నుంచి బయలుదేరిన మరో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు హడలిపోయారు.

English summary
All passengers and crew were evacuated by Bulgarian special forces, who found no explosives in an initial sweep of the plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X