వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్.. బ్రెగ్జిట్ దెబ్బకు థెరిసా మే రాజీనామా

|
Google Oneindia TeluguNews

లండన్ : యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త ప్రధాని అభ్యర్థి కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్‌కు 92,153 ఓట్లు వచ్చాయి. ఇక అతని ప్రత్యర్థిగా బరిలో నిలిచిన యూకే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జెరెమి హంట్‌కు 46,656 ఓట్లు పోలయ్యాయి. ఇక కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇక యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న బోరిస్ జాన్సన్ అంతకుముందు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా లండన్ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. బ్రెగ్జిట్‌పై మంత్రుల మధ్య విబేధాలు తలెత్తడంతో కొందరు మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇలా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వారిలో ఆర్థికశాఖ మంత్రి ఫిలిప్ హమ్మండ్ కూడా ఉన్నారు. ప్రస్తుత ప్రధాని థెరిసా మే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇక కొత్త ప్రధాని బ్రెగ్జిట్‌ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారనేదానిపైనే అందరి దృష్టి పడింది.

Boris Johnson elected the new PM of UK

బ్రెగ్జిట్ కోసం జరిగిన రెఫరెండంలో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు రావాలన్నదానికే మద్దతు తెలపడంతో ఇప్పుడు ప్రధానిగా ఆయన్ను ఎన్నుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక బోరిస్ జాన్సన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేందుకు విజయమో వీరస్వర్గమో అన్న నినాదాన్ని అందుకున్నవారిలో మొదటి వ్యక్తిగా నిలిచారు బోరిస్ జాన్సన్. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగితే ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టాన్ని కూడా ఆయన లెక్కచేయలేదు. ఏది ఏమైనప్పటికీ వైదొలగడమే మంచిదన్న అభిప్రాయంతో బోరిస్ జాన్సన్ పావులు కదిపారు.

English summary
Boris Johnson has won a Conservative Party leadership race and will become the U.K.’s next prime minister.Johnson was elected as his party leader, and consequently the U.K. leader, with 92,153 votes from members of the ruling Conservative Party. His rival in the race, Foreign Minister Jeremy Hunt, received 46,656 votes. Johnson will take up office on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X