• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మగాడు గర్భవతి అయ్యింది -బయట పురుషాంగం, లోపల అండాల ఉత్పత్తి -నిజంగా అద్భుతమే

|

కామెడీగా నవ్వుడానికి ఇదేమీ జంబలకడి పంబ బాపతు సినిమా కథ కాదు. మనుషుల జీవితాలతో విధాత ఆడే వింత ఆటలకు ఉదాహరణ. అచ్చంగా మగాడిగా పుట్టి.. పురుషాంగం కలిగిఉండి.. దాన్ని కత్తిరించుకోకుండానే గర్భం దాల్చిన ఓ టీనేజర్ నిజ జీవిత గాథ. కొద్ది గంటలుగా ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోన్న 18 ఏళ్ల మైకీ చానెల్ అసలు కథ..

తలకిందులైన స్కానింగ్

తలకిందులైన స్కానింగ్

అతనిది అమెరికాలోని బోస్టన్ నగరం. తను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు స్కానింగ్ చేయగా.. అమ్మాయేనని డాక్టర్లు సర్టిఫై చేశారు. తీరా ప్రసవం తర్వాత చూస్తే పురుష జననాంగాలతో కనిపించాడు. స్కానిగ్ చేసిన నిపుణులు, పురుడుపోసిన డాకర్టు, నర్సులతోపాటు తల్లిదండ్రులకు కూడా అదొక పెద్ద షాక్. తర్వాతికాలంలో థండర్ లు రుచిచూడాల్సి వచ్చిందా కుటుంబం.. పుట్టిన పిల్లాడికి మైకీ అని పేరు పెట్టారు. కానీ..

భయానక జీవితం..

భయానక జీవితం..

మైకీ పెద్దవుతోన్న కొద్దీ తనలో అన్నీ ఆడలక్షణాలే ఉన్నాయని గుర్తించాడు. ఒక్క పురుషాంగం తప్ప మిగతా శరీర భాగాలన్నీ అమ్మాయిల మాదిరిగానే పెరుగుతూ వచ్చాయి. ఆ దశలో స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడేవాడు. అతని శరీరం, ప్రవర్తనను ఎద్దేవా చేస్తూ ఏడిపించడివాళ్లంటూ లేరు. అతి కష్టం మీద కొనడుకును కాపాడుకుంటూ వచ్చారు మైకీ తల్లిదండ్రులు. 13ఏళ్ల వయసునాటికి తను ట్రాన్స్ జెండర్ అనే స్పృహ కలిగింది. ఆ తర్వాత ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం మానేశాడు. అయితే..

మగాడిలో అండాల ఉత్పత్తి..

మగాడిలో అండాల ఉత్పత్తి..

ప్రస్తుతం మైకీ చానెల్ వయసు 18 ఏళ్లు. కొంత కాలంగా అతను మూత్రం పోసేటప్పుడు పురుషాంగంలో విపరీతమైన నొప్పి, ఇబ్బంది తలెత్తాయి. ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది. మైకీ జననాంగం లోపలి భాగంలో అండాల ఉత్పత్తి జరుగుతోందని, అతని కడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ద్వారాలు కూడా ఉన్నాట్లు డాక్టర్లు గురించారు. ఇంకొన్ని పరీక్షల తర్వాత.. అతను గర్భం దాల్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. మైకీలో ‘Persistent M llerian duct syndrome (PMDS)' వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్యులు వివరించారు. కొంతమంది దీన్నొక అద్భుతంగానూ అభివర్ణిస్తున్నారు.

  Baby gets Surprise Birthday Cake from Hyderabad Police ahead of Parents’ Request From US
  ప్రాక్ వీడియో అనుకున్నా..

  ప్రాక్ వీడియో అనుకున్నా..

  ‘‘నేను కూడా పిల్లల్ని కనొచ్చని డాక్టర్లు చెప్పినప్పుడు చుట్టూ పరికించి చూశాను. ఎవరైనా ప్రాంక్ వీడియో చేస్తున్నారేమో అనుకున్నా. కానీ అది సీరియస్ విషయమని అర్థమయ్యాక నిజంగా సంతోషించాను. అమ్మాయిగా ఉండాలన్నదే నా కోరిక. ఇక అమ్మతనాన్ని కూడా పొందే అదృష్టం రావడాన్ని వరంగానే ఫీలయ్యా. పలు రకాల పరీక్షల తర్వాత.. ఐసిఎస్‌ఐ సహా అనేక ఫెర్టిలిటీ విధానాల్లో ప్రయోగాలు చేశారు. దాత నుంచి స్పెర్మ్ తీసుకుని నాలోకి ప్రవేశపెట్టారు. 20 శాతమే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అదృష్టవశాత్తూ నాకు వర్కౌట్ అయింది. నా బిడ్డను బాగా పెంచుకుంటూ, ముందుగా డిగ్రీ పూర్తి చేయాలన్నది నా తాత్కాలిక లక్ష్యం'' అని మైకీ చానెల్ చెప్పుకొచ్చింది.

  English summary
  A transgender teenager in Boston, who was born with male genitals, has become pregnant after discovering that she also has functional female reproductive organs. The 18-year-old Mikey Chanel identifies as a woman despite being raised as a boy by her family.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X