వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియాలో అసాధారణం: ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు: రెండింటికీ రెడీ: కిమ్‌జొంగ్

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కిమ్‌జొంగ్ ఉన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడిందని చెప్పారు. దీన్ని అధిగమించడానికి కొన్ని కఠిన, తక్షణ చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే- అగ్రరాజ్యం అమెరికాపైనా ఆయన తన వైఖరేమిటో స్పష్టం చేశారు. అమెరికాతో తమ దేశం చర్చలు, ఘర్షణలు..రెండింటికీ సిద్ధమవుతోందని తేల్చి చెప్పారు. అవసరమైతే ఘర్షణకు పూర్తిస్థాయిలో తాము సనద్ధమౌతామని కుండబద్దలు కొట్టారు. దౌత్యపరమైన సంబంధాలను కుదుర్చుకోవాలనే అంశాన్ని ఆయన తోసిపుచ్చారు.

స్వేచ్ఛకు భంగం..

స్వేచ్ఛకు భంగం..

ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి కిమ్‌జొంగ్ నేతృత్వం వహించారు. దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా స్వతంత్రత, స్వేచ్ఛ, అభివృద్ధి, జాతీయ ప్రయోజనాలను భంగం కలిగించే ఎలాంటి చర్యలను కూడా తాము అనుమతించబోమని అన్నారు. దీనికోసం ఎంతవరకైనా వెళ్తామని, వాటిని పరిరక్షించుకోవడానికి అవసరమైతే ఘర్షణకు పూనుకోవాలని అన్నారు.

బిడెన్‌తో భేటీ కాలేం..

బిడెన్‌తో భేటీ కాలేం..

శాంతియుత వాతావరణంలో చర్చలు కొనసాగించడానికే తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని కిమ్‌ పేర్కొన్నారు. దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందనే విషయాన్ని కిమ్‌జొంగ్ అంగీకరించారు. జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా సారథ్య బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాల గురించి వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంలో కిమ్‌జొంగ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్.. ఇటీవలే జో బిడెన్‌తో సమావేశమైన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను పొరపాటున గానీ బిడెన్‌తో సమావేశం కాబోనని అన్నారు.

అణ్వాయుధ విధానాలపై..

అణ్వాయుధ విధానాలపై..

తాము అనుసరిస్తోన్న అణ్వాయుధ విధానాలను అమెరికా అంగీకరించి తీరాల్సి ఉంటుందని, అప్పుడే తాను బిడెన్‌తో భేటీ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. దేశం ఆహార కొరతను ఎదుర్కొంటోందని, ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని అన్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయంటూ వివరణ ఇచ్చారు. తుఫాన్లు, వరదల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, దేశీయ అవసరాలు, మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా ధాన్యం, ఇతర ఆహార వస్తువులు ఉత్పత్తి చేయలేకపోయామని అన్నారు. అణ్వాయుధ విధానాల కారణంగా అంతర్జాతీయంగా ఎదుర్కొంటోన్న ఆంక్షలే దీనికి కారణమనడంలో అర్థం లేదని కిమ్ వ్యాఖ్యానించారు.

కరోనా కూడా కారణం..

కరోనా కూడా కారణం..


దేశంలో ఆహార కొరత ఏర్పడటానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకున్న చర్యలు కూడా ఓ కారణంగా ఆయన పేర్కొన్నారు. వైరస్ వల్ల దేశ సరిహద్దులను మూసివేయాల్సి వచ్చిందని, దిగుమతులు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి తగ్గినప్పటికీ..దేశ పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మెరుగైన ఫలితాలు వెలువడ్డాయని కిమ్‌జొంగ్ పేర్కొన్నట్లు కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.

English summary
North Korean leader Kim Jong Un has said his country needs to prepare for "both dialogue and confrontation" with the United States under President Joe Biden, state media reported Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X